Pavala Shyamala : తెలుగులో సీనియర్ ఆర్టిస్ట్ గా 300 పైగా సినిమాల్లో నటించిన పావలా శ్యామల ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో కాళ్ళు లేని కూతురుతో ఆర్ధిక కష్టాలతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీ నుండి ఎటువంటి సహాయం రాలేదంటూ ఆవిడ కామెంట్స్ చేసారు. బాగోలేదు సీరియస్ గా ఉంది అంటూ అందరికీ సందేశం వెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు, సహాయం చేయడం పక్కన పెడితే ఎవరూ ఎలా ఉన్నావ్ అని కూడా అడగలేదు అని బాధపడ్డారు. ప్రస్తుతం కూతురుతో కలిసి ఆశ్రమం లో ఉంటున్న ఆమె, ఆమె పై వస్తున్న పుకార్లకు క్లారిటీ ఇవ్వడానికి ఇంటర్వ్యూ ఇచ్చారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి అలాగే తన కూతురి పరిస్థితి గురించి చెప్పి ఎమోషనల్ అయ్యారు.

నేను ఎక్కువ రోజులు బ్రతకను…
నాటకరంగంలో నుండి సినిమాల్లోకి వచ్చిన శ్యామల గారు నాటకంలో 300 సార్లు ఉత్తమ నటిగా టైటిల్ అందుకుని ఆ పాత్ర పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న పావలా శ్యామల గారు ఇండస్ట్రీలో అడుగుపెట్టి అనేక సినిమాల్లో నటించినా రెమ్యూనరేషన్ విషయంలో అడగాలంటే బయపడేవారట. ఒకవేళ అడిగితే మళ్ళీ అవకాశం ఇవ్వరేమో అని ఆలోచించి అడిగేవారు కాదట, ఎంత డబ్బు ఇస్తే అంత తీసుకుంటూ వచ్చారట. ఇక సినిమాల్లోకి రావడం కుటుంబంలో ఇష్టం లేక కుటుంబం ఆమెను దూరంగా పెట్టారు. దీనితో సినిమాల్లో వచ్చిన వేషాలు వేసుకుంటూ జీవనం సాగించింది. ఇక చిన్నవయసులోనే కూతురు మేడపై నుండి పడి కాళ్ళు విరిగిపోవడంతో కుర్చీకి పరిమితమైంది. చికిత్స చేయించడానికి ఇండస్ట్రీ నుండి కొంతమంది సహాయం చేసారు. కానీ మంచానికే పరిమితమైంది.

ఇక శ్యామల గారు తన అనారోగ్య పరిస్థితి గురించి వివరిస్తూ ఎమోషనల్ అయ్యారు. గుండెలో రంధ్రాలు ఉన్నాయని డాక్టర్లు తేల్చారు. ఇప్పటికీ గుండెపోటు వచ్చి చికిత్స చేయించుకున్నాను అంటూ చెప్పారు. ఇక ఎక్కువ రోజులు బ్రతకనని డాక్టర్లు చెప్పారు, ఆపరేషన్ చేయించుకుంటే తట్టుకునే శక్తి తన శరీరానికి లేకపోవడం వల్ల ఆపరేషన్ వద్దని చెప్పారట. దీంతో ఎక్కువ రోజులు బ్రతకనని కేవలం మందులతో మాత్రమే కాలాన్ని వెళ్ళదీస్తున్నాను అంటూ శ్యామల ఎమోషనల్ అయ్యారు. ఇక నా కూతురు పరిస్థితి ఇలా ఉండటం వల్ల నేను చనిపోతే ఎవరు చూసుకుంటారు అనే భయం నన్ను కలిచివేస్తోంది అంటూ శ్యామల ఎమోషనల్ అయ్యారు.

































