Pavan sensational comments about suicide : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎంత క్రేజ్ ఉన్నా పాలిటిక్స్ లో మాత్రమే ఇంకా ఓనమాల్లోనే ఉన్నారు. టాలీవుడ్ no1 హీరో ఇంకా రాజకీయంలో ఇంకా ఎక్కాల్సిన మెట్లు చాలానే ఉన్నాయి.జన సేన పార్టీ స్థాపించి 10గడిచిన ఇంకా పార్టీ పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.క్రితం ఎన్నికలలో జనసేన పోటీచేసిన పవన్ ఓడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయినా ప్రజాసమస్యలపై మాట్లాడుతూ పవన్ రాజకీయంలో పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు

ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది…..
ఇక తాజాగా పవన్ కౌలు రైతుల ఆత్మహత్యల పై స్పందిస్తూ అనంతపురం జిల్లాలోని ఆత్మహత్య చేసుకుని చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు డబ్బు సహాయం చేసారు. సుమారు 30 కుటుంబాలకు లక్ష చొప్పున ఇచ్చారు. ఈ సందర్బంగా మాట్లాడిన జనసేనాని తాను ఇంటర్ చదివేటపుడు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని షాకింగ్ న్యూస్ చెప్పారు.ఇంటర్ చదివే సమయంలో సరిగ్గా చదువుకోవట్లేదు అని బాధతో ఆత్మహత్య చేసుకుంటే మంచిదని ఆలోచించానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. కానీ అదృష్టం కొద్దీ నా సోదరుడు నాగబాబు, వదిన పక్కన ఉండి మంచి మాటలు చెప్పి నన్ను కాపాడారని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఇక పవన్ మాట్లాడుతూ నేను అద్భుతాలు చేస్తానని చెప్పనని పవన్ అన్నారు. ఈ సహాయం నేను ఓట్లకోసం చేయడం లేదని చెప్పారు.మానవత్వంతో మాత్రమే చేస్తున్నానని చెప్పారు. ఇక పవన్ తన సినిమా లను త్వరగా పూర్తి చేసి 2014 ఎన్నికలకు సిద్ధామవ్వాలని భావిస్తున్నారు.2024 ఎన్నికల సమయానికి టీడీపీ,బీజేపీ తో కలిసి పోటీచేసే అవకాశాలు లేకపోలేదు అయితే ఈ సారి మాత్రం ఖచ్చితంగా అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట పవన్ కళ్యాణ్.
































