Pavithra Lokesh : సీనియర్ నటుడు నరేష్, అలాగే సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ ఇద్దరూ గత కొన్నిరోజులుగా బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు త్వరలో పెళ్లి చేసుకుంటారు అంటూ వార్తలు వచ్చాయి. ఇక నరేష్ ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఇది నాలుగో పెళ్లి అవడం వల్ల ఈ న్యూస్ బాగా సంచలనం అయింది. అయితే వార్తలు వస్తున్న ఈ విషయంపై ఇద్దరూ స్పందించలేదు. ఈ కాలం లో అసలు పెళ్లి కాన్సెప్ట్ తప్పు అన్నట్లుగా చెప్పారు. విడిపోవాలనేంత నిర్ణయం తీసుకోవాలంటే ఎంత మానసిక క్షోభ అనుభవించాలి అంటూ చెప్పారు.

నరేష్ తో సహజీవనం… కృష్ణ గారి అనుమతితోనే…
ఇక పవిత్ర లోకేష్ అసలు ఈ విషయాలపై స్పందించలేదు. కానీ కన్నడ నటి అయిన పవిత్ర లోకేష్ పైన కన్నడ చానెల్స్ లో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇక నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి నరేష్ తో ఇంకా విడాకులు తీసుకుని విడిపోలేదని చెప్పడం, పవిత్ర లోకేష్ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది అంటూ ఆరోపించడంతో పవిత్ర లోకేష్ మీద ఒక కన్నడ న్యూస్ ఛానెల్ స్ట్రింగ్ ఆపరేషన్ కు పూనుకుంది. ఇక ఈ స్ట్రింగ్ ఆపరేషన్ లో పవిత్ర నరేష్ తో సహజీవనం చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. అంతే కాకుండా దీనికి సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబం నుండి ఆమోదం ఉంది అని ఆయనతో పాటు వల్ల ఇంట్లో నేను, నరేష్ ఉంటున్నాం అని చెప్పింది.

ఇక తాను మీడియా ముందుకు తన కెరీర్ మొదటి నుండి ఇప్పటివరకు ఎప్పుడు రాలేదని ఇప్పుడెందుకు రావాలని అన్నారు. ఇక కన్నడ లో పి హెచ్ డి చేస్తున్నట్లు చెప్పారు. నరేష్ ను పెళ్లి చేసుకునే ఉదేశ్యం లేదని తనకు ఎలాంటి గుర్తింపు అవసరం లేదని చెప్పారు. ఇక నరేష్ చాలా మంచివాడని తనతో చాలా హ్యాపీ గా ఉన్నానని రమ్య తో నరేష్ విడాకులు తీసుకోలేదు కాబట్టి మేము పెళ్లి గురించి ఆలోచించడం లేదని చెప్పారు. ఇక నరేష్ మూడో భార్య రమ్య తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, తనకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు అంటూ చెప్పారు. ఇక ఈ విషయాలపై నరేష్ మూడో భార్య రమ్య స్పందిస్తూ నేనెవరినీ చీట్ చేయలేదు కరోనా వల్ల డబ్బు ఇవ్వడం ఆలస్యమైంది, అందరికీ సెటిల్ చేస్తున్నాం, నేను నరేష్ విడాకులు తీసుకోలేదు అంటూ చెప్పారు. ఇక పవిత్ర లోకేష్ మీద జరిగిన స్ట్రింగ్ ఆపరేషన్ ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది



























