Pavithra Lokesh : సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ ల వ్యవహారం ఇప్పటివరకూ రూమర్ గానే ఉంది. అయితే ఇప్పుడు మాత్రం రచ్చబండ దగ్గర పంచాయతీలా తయారయ్యింది. పూటకు ఒకరు మీడియా ముందుకు వచ్చి ఈ మ్యాటర్ లో కొత్త మలుపు తిప్పుతున్నారు. ఇంతవరకు పవిత్ర లోకేష్, నరేష్ లు సహజీవనం చేస్తున్నారనే టాపిక్ వైరల్ అయితే ప్రస్తుతం మాత్రం నరేష్ మూడో భార్య రమ్య మీడియా ముందుకు వచ్చి నేను విడాకులు ఇవ్వలేదు అంటూ తనకు తన భర్తకు మధ్య పవిత్ర చిచ్చు పెట్టింది అంటూ ఆరోపించింది.

ఏదైనా ఉంటే అక్కడ తేల్చుకోవచ్చుగా ఇక్కడెందుకు…
ఇక పవిత్ర లోకేష్ మీద కాపురాలు కూలుస్తోంది అంటూ ఆరోపించడంతో పవిత్ర తాజాగా మీడియా ముందుకు వచ్చి స్పందించారు. నరేష్ కు నాకు మధ్య ఉన్న రిలేషన్ మీ అందరికి తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ నా మీద ఆరోపణలు చేస్తుంటే మౌనంగా ఉండలేక మీడియా ముందుకు వచ్చాను. నరేష్ మూడో భార్య రమ్య నాపై ఆరోపణలు చేస్తోంది.

ఏదైనా భార్య భర్తల మధ్య గొడవలు ఉంటే హైదరాబాద్ లో పెద్దల సమక్షంలో తేల్చుకోవచ్చు కదా, ఇక్కడ కన్నడ మీడియా ముందు ఎందుకు రచ్చ చేస్తోంది. ఈ విషయం అయి నరేష్ కూడా బెంగళూరు వచ్చారు. ఆమెకు భర్తతో ఉండాలని ఉంటే ఫ్యామిలీ సమస్యలను పరిష్కరించుకోవాలి ఇలా మీడియా ముందు రచ్చ ఎందుకు. నరేష్ తెలుగులో ఫేమస్ యాక్టర్ ఆయనకు, నాకు సపోర్ట్ చేయండి అంటూ మీడియా ముందు చెప్పారు.



























