Pavitra Lokesh:పవిత్ర లోకేష్ పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ గా మారిన ఈమె ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి నరేష్ తో రిలేషన్ లో ఉండడంతో ఒక్కసారిగా సెన్సేషనల్ గా నిలిచారు. పవిత్ర లోకేష్ నరేష్ వ్యవహార శైలి తీవ్రస్థాయిలో వివాదాస్పదంగా మారిన విషయం మనకు తెలిసిందే.

ఇక పవిత్ర లోకేష్ నరేష్ ఇద్దరు జంటగా తాజాగా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఫలితాలను అందుకున్నప్పటికీ ఈ సినిమాలో వీరిద్దరూ చాలా రొమాంటిక్గా నటించారని మాత్రం తెలుస్తుంది.ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నరేష్ పవిత్ర ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరైన సంగతి మనకు తెలిసిందే.
ఇలా వీరిద్దరూ పళ్ళు ఇంటర్వ్యూలకు హాజరవుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇకపోతే పవిత్ర లోకేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఇండస్ట్రీలో ఇష్టమైన హీరోల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.తనకు ఇద్దరు హీరోలు అంటే క్రష్ అని ఈ సందర్భంగా వారి పేర్లను బయటపెట్టారు. తాను స్కూల్లో చదువుతున్న సమయంలో నాగార్జున గారు నటించిన గీతాంజలి సినిమా విడుదలైంది.

Pavitra Lokesh: నాగార్జున… ప్రకాష్ రాజ్…
ఈ సినిమా చూసిన తర్వాత తనకు భర్త ఉంటే ఇలాంటి వ్యక్తి రావాలని ఆ క్షణం అనిపించిందని అందుకే తనకు నాగార్జున అంటే చాలా ఇష్టం అని తెలిపారు. ఇక నాగార్జున తర్వాత అదే స్థాయిలో ఇష్టమైనటువంటి మరొక నటుడు ప్రకాష్ రాజ్. ఈ ఇద్దరు హీరోలు తనకు క్రష్ అంటూ ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



























