పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా లుక్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు గ్లిమ్ప్స్ ని కూడా రిలీజ్ చేశారు చిత్ర బృందం.. ఈ లుక్ లో పవన్ ఓ రేంజ్ లోకనిపించాడు. చారిత్రాత్మక లుక్ లో పవన్ కళ్యాణ్ ని చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదని అభిమానులు చెప్తున్నారు.. ఈ లుక్ పవన్ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెడుతుండడంతో ఎలాంటి సందేహం లేదు. కానీ పవన్ ఫాన్స్ మాత్రం ఈ లుక్ చుసిన దగ్గరినుంచి షాక్ కి గురయ్యి ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారట.. వకీల్ సాబ్ తర్వాత సరైన అప్ డేట్ లేక అల్లాడిపోతున్న పవన్ ఫ్యాన్స్ కి ఈ లుక్ వచ్చాక పండగ చేసుకుంటున్నారు..
ఈ నేపథ్యంలో ప్రభాస్ ‘బాహుబలి’ చేశాక.. టాలీవుడ్ అభిమానులందరూ తమ హీరోలను కూడా అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న, ఎపిక్ మూవీస్‌లో చూసుకోవాలని ఆశపడ్డారు. అవి పాన్ ఇండియా స్థాయిలో వెలిగిపోవాలని కోరుకున్నారు. ఐతే అందరు అభిమానులకూ ఆ ఆశ తీరలేదు. చిరంజీవి ఒక్కడు ‘సైరా’తో ఆ తరహా సినిమా చేశాడు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. పవర్ స్టార్‌కు ఉన్న క్రేజ్, బాక్సాఫీస్ స్టామినాకు సరైన పీరియడ్ మూవీ పడితే దాని రేంజే వేరుగా ఉంటుందన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. ఐతే తన క్యాలిబర్‌కు తగ్గ సినిమాలు పవన్ సెట్ చేసుకోడనే విమర్శ ఉంది.
గత కొన్నేళ్లలో పవన్ చేసిన సినిమాల వరస చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.ఐతే ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో పవన్ చేస్తున్నది.. అచ్చంగా అభిమానులు కోరుకుంటున్న సినిమానే. తాముకోరుకున్న సినిమా ని పవన్ ఇంత త్వరగా చేస్తాడని వారు అనుకోలేదట.. క్రిష్ సినిమా అలాంటి సినిమానే అయినప్పటికీ అయన టేకింగ్ మీద డౌట్ ఉందట.. ఇప్పుడు ఈ గ్లిమ్ప్స్ లో అవతారం, స్క్రీన్ ప్రెజెన్స్, భారీతనం చూసి పవన్ అభిమానులు షాకైపోయిన మాట వాస్తవం. మరి సినిమాతో వారిని మరింతగా షాక్‌కు గురి చేస్తాడేమో క్రిష్ చూడాలి.



























