పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 1965లో ఆంధ్రాలోని మొగల్తూరులో వెంకట్ రావు, శ్రీమతి అంజనా దేవి దంపతులకు జన్మించారు. పవన్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (PMPF) అనే సంస్థను అక్టోబర్ 2007లో ప్రారంభించారు. సామాజిక సమస్యలను పరిష్కరించడం, సమాజంలో నిర్లక్ష్యం చేయబడిన వర్గాలకు సహాయం చేయడం. ఈ సంస్ధ ముఖ్యోద్దేశ్యం. అలాగే కార్పస్ ఫండ్, సిఎంపిఎఫ్ కోసం 1 కోట్ల రూపాయల విరాళం కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కల్యాణ్ బాబు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అందరికీ పవర్ స్టార్ గా తెలుసు. కానీ ఈయన్ని టాలీవుడ్ కి పరిచయం చేయడానికి చిరంజీవి గారు మాత్రం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. తమ్ముడిని తనలాగే మెగా హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడానికి చాలా మంది దర్శకులను పరిశీలించిన తర్వాత చివరికి ఈవీవీ సత్యనారాయణ గారితో ఒప్పందం కుదిర్చుకున్నారు. అప్పటికే హిందీలో సూపర్ డూపర్ హిట్టైన “ఖయామత్ సే ఖయామత్ తక్” చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా మార్చి తీసాడు ఈవీవీ. ఈ సినిమాలో హీరోయిన్‌గా కూడా అక్కినేని వారసురాలైన సుప్రియను తీసుకుని అటు అక్కినేని ఫ్యాన్స్ ను, ఇటు చిరు ఫ్యాన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు ఈవీవీ. ఈ చిత్రం విజయం సాధించిన తర్వాత నాటి తమ్ముడు, బద్రి, తొలి ప్రేమ వంటి చిత్రాల నుండి నేటి వకీల్ సాబ్ చిత్రం వరకూ వరుసగా హ్యాట్రిక్ చిత్రాలలో నటించి పవర్ స్టార్ గా మెగా ఫ్యాన్స్ హృదయాలలో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నారు. ఇంతవరకూ అందరికీ తెలిసిందే..

అయితే “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” సినిమా కోసం పవన్ తీసుకున్న రెమ్యూనరేషన్ చాలా తక్కువ. సినిమా షూటింగ్ జరిగిన అన్ని రోజులు నెలకు 5 వేల రూపాయలు రెమ్యూనరేషన్ గా ఇచ్చాడట నిర్మాత అల్లు అరవింద్. అప్పట్లో ఈ విషయం పవన్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే సొంత నిర్మాణ సంస్థ కావడంతో అలా ఇచ్చివుండొచ్చు అనే వారు లేకపోలేదు. పైగా ఆ సినిమా సమయానికి పవన్ ఎవరికీ తెలియదు. దాంతో తొలి సినిమాకు చాలా తక్కువ పారితోషికమే తీసుకున్నాడు పవన్. అదే ఇప్పుడు పవన్ రేంజ్ వేరు.. పవన్ తో సినిమా చేయాలంటే కనీసం 50 కోట్లు పారితోషకం ఇవ్వాల్సిందే. కేవలం 5 వేలతో మొదలై 50 కోట్లకు తన రేంజ్ పెంచుకున్న పవన్ 25 ఏళ్ల ప్రయాణం అద్భుతమే.

కానీ పవన్ కళ్యాణ్ డేట్ ఇఛ్చినా కూడా నిర్మాతలు మాత్రం టెన్షన్ పడుతూనే ఉంటారనడానికి ఉదాహరణగా పవన్ ఒప్పుకున్న కొన్ని చిత్రాలు చాలా వరకు పూర్తి కాలేదు. కొన్ని పట్టాలెక్కకుండానే ఆగిపోయాయి. మరికొన్ని చిత్రాలలో వేరే హీరోలకు ఛాన్స్ దొరికింది. మరి ఆ చిత్రాల వివరాలను పరిశీలిస్తే..
చెప్పాలని ఉంది మూవీ

పవన్ కళ్యాణ్, అమీషా పటేల్ జంటగా ఈ సినిమాను సూర్య మూవీస్ ప్లాన్ చేసింది. కానీ అదే సినిమాను ఆ తర్వాత నువ్వే కావాలి పేరుతో తెరకెక్కించారు.
సత్యాగ్రహి మూవీ

జానీ చిత్రం తర్వాత మరోసారి డైరెక్షన్ చేయాలని పవన్ రాసుకున్న కథ సత్యాగ్రహి. ఇది కూడా ఏఎం రత్నం నిర్మాతగానే అట్టహాసంగా మొదలై సెట్స్‌పైకి వెళ్లకుండానే ఆగిపోయింది.
సింగీతం శ్రీనివాసరావు జీసెస్ క్రైస్ట్ మూవీ

అప్పట్లో ఏసుక్రీస్తు జీవితంపై పవన్ హీరోగా సింగీతం ఓ సినిమా ప్లాన్ చేసాడు. పబ్లిసిటీ కూడా చేశారు. కానీ ఆ తర్వాత ఎందుకనో ఈ సినిమా ఆగిపోయింది.
దేశి మూవీ

దేశభక్తి నేపథ్యంలో తాను సొంతంగా కథ రాసుకుని పవన్ కళ్యాణ్ చేయాలనుకున్న సినిమా దేశీ. కానీ అనివార్య కారణాలతో ఈ చిత్రం కూడా పట్టాలెక్కలేదు.
లారెన్స్ మూవీ

పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని లారెన్స్ చాలా ఏళ్లుగా కలలుకన్నాడు. అప్పట్లో ప్రకటించాడు కూడా.. కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్ నేటికీ కుదర్లేదు.
కోబలి మూవీ

త్రివిక్రమ్ డైరెక్షన్ లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పవన్ కళ్యాణ్ హీరోగా కోబలి సినిమా చేద్దామనుకున్నాడు త్రివిక్రమ్. కానీ అది కుదర్లేదు.. అదే కథను కాస్త అటూ ఇటూ మార్చి ఎన్టీఆర్‌తో అరవింద సమేత చేసాడంటున్నారు సినీ విశ్లేషకులు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు

ఈ సినిమాలో ముందు పవన్, వెంకటేష్ చేయాల్సి ఉంది. ఈ చిత్రం ప్రారంభ సమయంలో వార్తలు కూడా వచ్చాయి. కానీ అనుకోకుండా పవన్ తప్పుకోవడం.. మహేష్ బాబు రావడం జరిగిపోయాయి.
వినాయక్ మూవీ

మాస్ దర్శకుడు వినాయక్ చాలా ఏళ్లుగా పవన్ సినిమా కోసం చూస్తున్నాడు. ఆ మధ్య అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. కానీ ఆదిలోనే ఆ ప్రయత్నం ఆగిపోయింది.
సంపత్ నంది మూవీ

గబ్బర్ సింగ్ 2 సినిమాకు దర్శకుడిగా సంపత్ నందిని అనౌన్స్ చేసాడు పవన్ కళ్యాణ్. రచ్చతో హిట్ కొట్టిన ఈయనకు పవన్ ఛాన్సిచ్చాడు. కానీ అనుకోకుండా ఈ సినిమా ఆగిపోయింది.
ఎస్‌జే సూర్య, పవన్ ల మూవీ

కాటమరాయుడు కంటే ముందు ఎస్‌జే సూర్యతో ఓ సినిమా ప్రారంభించాడు పవన్. కానీ ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లకుండానే ఆగిపోయింది.
నీసన్, పవన్ కళ్యాణ్ ల మూవీ

నీసన్ డైరెక్షన్ లో తమిళంలో హిట్టైన వేదాళం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు పవన్. ఓపెనింగ్ కూడా చేసిన తర్వాత ఈ సినిమాను మధ్యలోనే ఆపేసారు.
ఖుషీ 2 మూవీ

చాలా ఏళ్లుగా ఖుషీ 2 చేయాలనుకుంటున్నాడు పవన్. ఆ మధ్య చెప్పాడు కూడా చేస్తానని. కానీ ఇప్పటికీ రాలేదు.. ఇంకపై వస్తుందనే నమ్మకం కూడా లేదు.

ఇక పవన్ రాజకీయ జీవితంలోకి తొంగి చూస్తే.. పవన్ కళ్యాణ్ 2014 మార్చిలో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో జనసేన పార్టీని ప్రారంభించారు. జనసేన అంటే తెలుగు భాషలో పీపుల్స్ ఆర్మీ. మార్చి 10, 2014 న పార్టీ పేరు నమోదు చేయడం కోసం ఒక దరఖాస్తును సమర్పించారు. పవన్ కళ్యాణ్ 14 మార్చి 2014 న మాధాపూర్ లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో లాంఛనంగా పార్టీని ప్రారంభించారు. పార్టీని 11 డిసెంబర్ 2014 న ఎన్నికల కమిషన్ ఆమోదించింది. పవన్ ఒక్కసారిగా రాజకీయాల్లోకి రావడంతో అప్పటికే ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాలలో విఫలమైన మెగాస్టార్ చిరంజీవి, పవన్ ల మధ్య తగాదాలు మొదలయ్యాయంటూ ఆ మధ్య సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి.

ఇదే విషయాన్ని చిరంజీవి దగ్గర ప్రస్తావించగా.. “మా ఇద్దరి దారులు వేరైనా గమ్యం ఒక్కటే. తన దారిలోకి వెళ్లి నేనేమి సలహాలు ఇవ్వను? తన ఖాళీ సమయాలలో ఇంటికి వస్తాడు. అమ్మను కలుస్తాడు.. అందరితో కలిసి సంతోషంగా భోజనం చేస్తాడు. ఇక మేమిద్దరం కలుసుకున్నప్పుడు పాలిటిక్స్ కంటే కుటుంబం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం” అని ఓపెన్ గా చెప్పుకొచ్చారు చిరంజీవి. ఇదిలావుండగా పవన్ కళ్యాణ్ గురించి “పవనిజం” అనే పుస్తకం రాస్తున్న పవన్ అభిమాని శ్రీకాంత్ తన రీసెర్చిలో భాగంగా శ్రీకాంత్ చాలాసార్లు పవన్ కళ్యాణ్ తండ్రి వెంకట్రావ్, తల్లి అంజనా దేవి, ఆయన సోదరులు చిరంజీవి, నాగబాబులను కలిసి పవన్ వివరాలను సేకరించాడు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తండ్రి మాట్లాడుతూ.. “ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల రూపాయిల విలువైన పుస్తకాలను పవన్ ఇంట్లో భద్రపరిచి వుంటాయని.. తీరిక సమయాలలో పవన్ వాటిని చదువుతుంటాడని, పవన్ కళ్యాణ్ రమణ మహర్షిని ఫాలో అవుతుంటాడు” అని తెలియజేశారు. కానీ “పవనిజం” పుస్తకంలో పవన్ ఫ్యాన్స్ కు ఇన్స్‌స్పిరేషన్ గా ఉంటుందని పవన్ లక్షకు పైగా పుస్తకాలను చదివాడని పుస్తక రచయిత శ్రీకాంత్ రాయడంతో ఆ టాపిక్ అప్పట్లో వైరలయ్యింది.

చివరిగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ప్రేమ వ్యవహారాల విషయానికొస్తే.. నేటివరకు పవన్ కళ్యాణ్ కి 3 పెళ్ళిళ్ళయ్యాయన్నది మాత్రమే తెలుసు. కాని ఈ 3 పెళ్ళిళ్ళకంటే ముందుగా ఒక అమ్మాయిపై ప్రేమ పుట్టిందట. కానీ ఆ విషయం ఇప్పటివరకు వెలుగులోకి రాలేదు తాజాగా ఈ విషయం సోషల్ మీడియాలో షికార్లు చేస్తుంది. ఇంతకీ ఆ తొలిప్రేమ ఎవరితో? ఎక్కడ, ఎలా మొదలైందనే వివరాల్లోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ వ్యవహారం తను సినిమాల్లోకి రాకముందు జరిగిందట. చిరంజీవి గారు అప్పట్లో తన ఫ్యామిలీతో కలిసి చెన్నైలో ఉండేవారు. ఆ టైంలో చిరు సినిమాలతో బిజీగా ఉంటె పవన్ కళ్యాణ్ మాత్రం కాలేజ్ కి వెళ్తూ కంప్యూటర్ క్లాస్ నేర్చుకుంటూ ఉండేవాడు.

ఇక ఈ తొలిప్రేమ ఎప్పుడు మొదలైందంటే ఆ కంప్యూటర్ క్లాస్ లోనే స్టార్ట్ అయ్యిందని చెప్పవచ్చు. పవన్ వెళ్ళే కంప్యూటర్ క్లాస్ కి ఒక అందమైన అమ్మాయికి కూడా వచ్చేది. అమ్మాయి అందంగా వుండటంతో పవన్ కళ్యాణ్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం రోజురోజుకి పెరుగుతు వచ్చింది. ఇంతలో కంప్యూటర్ క్లాస్ కూడా అయిపోవచ్చింది. పవన్ ఒన్ సైడ్ లవ్ ట్రాక్ తెలిసిన పవన్ ఫ్రెండ్స్ మీ ఇద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ కాదని అది లవ్ అని, త్వరగా నీ మనసులోని మాటని ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆ అమ్మాయితో చెప్పమని పవన్ ఫ్రెండ్స్ ప్రోత్సాహించడంతో నిజంగానే ‘అది ప్రేమేనేమో’ అనుకుని.. ఆమెకు ‘ఐ లవ్ యూ’ చెప్పేందుకు సిద్దమయ్యాడు పవన్. వారి ఇంట్లో ఎవరూ వాడకుండా మూల వుంచేసిన ఓ పాత కారుని బయటకు తీసి, శుభ్రం చేసి సిద్ధం చేసుకున్నాడు. ఇంతలో ఆ అమ్మాయికి జాబు వచ్చేసింది. అలా జాబ్ రావడంతో రోజు ఆ అమ్మాయి పవన్ పాత కారులోనే ఆఫీస్ కి వెళ్తూ ఉండేది. ఒకరోజు పవన్ మీ ఇంటి దగ్గర దింపేస్తా అని చెప్పి మార్గం మధ్యలో తన మనసులోని మాటని ఆ అమ్మాయికి చెప్పేశాడు. అప్పుడా అమ్మాయి అసలు నీకు ప్రేమంటే ఏంటో తెలుసా? అయిన ఈ వయసులో ప్రేమ ఏంటీ అని కాసేపు క్లాస్ పికిందట. అంతే ఇంకా పవన్ సైలెంట్ అయిపోయాడు.

ఆ క్షణంలో తను క్లాస్ పికుతుంటే క్లాస్ టిచర్ క్లాస్ పికినట్లే ఉందని తెలిపారు. ఇలా తన చిన్ననాటి.. ప్రేమ విషయాలను గుర్తు చేసుకున్నారు. మొత్తం మీద పవన్ ప్రేమ వ్యవహారం భలేగా ఉందే అంటూ ఫ్యాన్స్ కూడా చర్చించుకుంటున్నారు. మొత్తానికి పవన్ తన లైఫ్ ను బాగానే ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తుంది.



























