Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో 150 రోజుల కూటమి పాలన గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టారు. ఈ సందర్భంగా కూటమి పాలన గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ 150 రోజుల కాలంలో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుందని తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు.
ముఖ్యంగా పాఠశాలలలో మధ్యాహ్న భోజనం పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరును పెట్టడంతో చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ చేతులు జోడించి మరి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం కలిగిన నాయకుడు రాష్ట్రానికి ఎంతో అవసరం అని తెలిపారు. ఇలాంటి అనుభవం కలిగిన వారు అధికారంలో ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
ఇటీవల విజయవాడలో వరదలు రావడంతో చంద్రబాబు నాయుడు ఆఫీసులో కూర్చుని అధికారులకు ఆదేశాలు ఇచ్చి పనులు చేయించుకోవచ్చు కానీ ఆయన అలా చేయలేదు ప్రజల ముందుకు వచ్చి నేనున్నాను ఎవరు భయపడొద్దు అంటూ ప్రజలకు భరోసా కల్పించి బురదలో కూడా ఈయన పర్యటనలు చేశారు.
గత ప్రభుత్వ హయామంలో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎవరు కూడా చేపట్టలేదని అందుకే రాష్ట్రానికి అనుభవం కలిగిన నాయకుడు ఎంతో అవసరమని పవన్ తెలిపారు. ఇలా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ కార్యక్రమాలను కనుక చూస్తే మరో 10 సంవత్సరాల పాటు మన బాబు గారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. ఇలా బాబు గురించి పవన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…