Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పవన్ కళ్యాణ్ కి కోట్ల మంది వీరాభిమానులు ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలతో పవన్ కళ్యాణ్ చాలా బిజిగా ఉన్నాడు.

ఇదిలా ఉండగా గతంలో డైరక్టర్ పూరీజగన్నాథ్ గురించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పూరీ జగన్నాథ్ టాలివుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ దర్శకులలో ఒకరిగా మంచి గుర్తింపు పొందాడు.
ఇదిలా ఉండగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన బద్రి సినిమా ద్వారా పవన్ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. బద్రితోనే పవన్ కు పవర్ స్టార్ అనే బిరుదు వచ్చింది. ఆ సినిమా నుంచే పవన్ రేంజ్ కూడా అమాంతం పెరిగిపోయిందని చెప్పటంలో సందేహం లేదు.
ఇలా తనకు స్టార్డం తెచ్చిపెట్టిన పూరి జగన్నాథ్ గురించి పవన్ కళ్యాణ్ సంచలనం వ్యాఖ్యలు చేయటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. బద్రి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ఎవరు ఊహించని విధంగా పరాజయాన్ని అందుకుంది. ఆ సినిమా ఫ్లాప్ తర్వాత ఒకసారి మీడియా ముందుకి వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అవ్వటానికి గల కారణాల గురించి మాట్లాడుతూ..

Pawan Kalyan: పూరి పై నమ్మకంతోనే కాదనలేకపోయా…
నిజానికి నాకు పూరీ జగన్నాథ్ చెప్పిన కథ వేరు. ఆయన తీసిన కథ వేరు. ఆయన మీద ఉన్న నమ్మకంతో నేను కూడా కాదనలేక పోయాను. కానీ స్టోరీలో బలం లేకపోవడంతో సినిమా ప్లాప్ అయ్యింది. నేను పూరీని నమ్మడం వల్లే ఇదంతా జరిగింది అంటూ గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.