Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్ర చేపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వారాహి యాత్రలో భాగంగా రాష్ట్ర రాజకీయాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ జూన్ 16వ తేదీ కాకినాడ పిఠాపురంలో పర్యటించారు. ఈ క్రమంలోనే ఈయన యువతను ఉద్దేశిస్తూ పలు విషయాలు తెలియజేశారు.

ఈ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ… సినిమాలు వేరు రాజకీయం వేరు అంటూ ఈయన కామెంట్ చేశారు. యువత ఎప్పుడు కూడా సినిమాలపరంగా తమకు ఇష్టమైన హీరోని ఆరాధించవచ్చు వారి సినిమాలను చూడవచ్చు కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వస్తే వారి ఆలోచన ధోరణి మార్చుకోవాలని ఈయన సూచించారు.
తాను కూడా టాలీవుడ్ హీరోలంటే చాలా ఇష్టపడతానని తన తోటి హీరోల సినిమాలను తప్పకుండా చూస్తానని ఈయన తెలియజేశారు. చిరంజీవి రామ్ చరణ్ సినిమాలను ఇష్టపడతాను అలాగే తనకు ప్రభాస్ ఎన్టీఆర్ అన్న కూడా చాలా ఇష్టమైననీ వారి సినిమాలను కూడా తాను చూస్తాను అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ గురించి పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan: చరణ్.. తారక్..ప్రభాస్ అంటే ఇష్టం
ఈ విధంగా వారాహి యాత్రలో టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడటమే కాకుండా వారి సినిమాలను కూడా చూస్తాను అంటూ ఈయన హీరోల పేర్లు ప్రస్తావిస్తూ చెప్పడంతో సదరు హీరో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయాని కొస్తే ప్రస్తుతం ఈయన పలు సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు వారాహి యాత్ర చేపడుతూనే మరోవైపు సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు.
Appeal to All Fandoms from Janasena Chief Pawan Kalyan.#VarahiVijayaYatra pic.twitter.com/XYKKEDT8zG
— Raees (@RaeesHere_) June 16, 2023































