Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అనారోగ్యం గురించి బయటపెట్టిన తల్లి అంజనా దేవి..?

0
48

Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా కాకుండా పవర్ స్టార్ గా తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో మరొకవైపు రాజకీయాలలోనూ బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలలో నటిస్తున్నాడు. అలాగే ఎలక్షన్ సమయం దగ్గర పడటంతో ప్రచార కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటున్నాడు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గురించి ఆయన తల్లి అంజనా దేవి ఇటీవల కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజనా దేవి తన చిన్న కుమారుడు పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ఈ క్రమంలో ఆవిడ మాట్లాడుతూ..” పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఎండనక వాననక తిరుగుతూ తన ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోడు. కానీ పవన్ కళ్యాణ్ కి చిన్నప్పుడు ఆస్తమా ఉండేది. అందువల్ల తనని చాలా జాగ్రత్తగా చూసుకునే దాన్ని అని తెలిపింది. అయితే ఇప్పుడు ఇన్ని కోట్ల మందికి సహాయం చేయమని భగవంతుడు వాడికి పని అప్పగించాడు. ఏదోరోజు కచ్చితంగా వాడు విజయం సాధిస్తాడనే నమ్మకం నాకుంది అంటూ చెప్పుకొచ్చింది.

Pawan Kalyan: సురేఖ కోడలు కావటం అదృష్టం…

అలాగే పెద్ద కొడుకు చిరంజీవి, కోడలు సురేఖ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెద్ద కుమారుడు చిరంజీవికి చిన్న నాటి నుండి సాయం చేసే గుణం ఉందని, మెగాస్టార్ గా గొప్ప స్థాయికి చేరుకున్నా కూడా ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాడు అని తెలిపింది. ఇక కోడలు సురేఖ గురించి మాట్లాడుతూ .. తను నాకు కోడలు కాదు కూతురు. ఎల్లప్పుడూ నన్ను కాచుకొని చిన్న పిల్లలాగా చూసుకుంది. తాను నా కోడలిగా దొరకటం నా అదృష్టం అంటూ చెప్పుకొచ్చింది.