Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలలో సంచలనగా మారారు. జనసేన పార్టీని స్థాపించిన తర్వాత మొదటిసారి గెలుపు అందుకొని అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున పిఠాపురం నుంచి 70 వేల కోట్ల మెజారిటీతో గెలిచారు. అంతేకాకుండా ఈయన కూటమిలో భాగంగా జనసేన పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు రెండు ఎంపీ స్థానాలలో పోటీ చేయగా 100కు 100% విజయం సాధించారు.

ఇక పవన్ కళ్యాణ్ తో పాటు మరికొంతమంది జనసేన నాయకులకు ఏపీ క్యాబినెట్లో మంత్రి పదవులు దక్కాయి. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. అంతేకాకుండా ఐదు శాఖలకు మంత్రిగా కూడా ఈయన నియమింపబడ్డారు.
ఇలా మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలను త్వరలోనే తీసుకుపోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం సెక్రటేరియట్లో ఈయనకు ఛాంబర్ సిద్దమవుతుందని త్వరలోనే ఈయన మంత్రిగా బాధ్యతలు కూడా తీసుకుపోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ నెల 19వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మాత్రమే కాకుండా మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకోబోతున్నారు.
ప్రజాసేవకే పరిమితం..
ఇక రాజకీయాలలో ఈయన బిజీగా మారిన నేపథ్యంలో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై పవన్ కళ్యాణ్ తెరపై మనం చూడలేమా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈయన కమిట్ అయిన మూడు సినిమాలు షూటింగ్ పనులు సగం వరకు పూర్తి చేసుకున్నాయి. అయితే ఆయనకు వీలైనప్పుడు మిగతా సినిమాలను పూర్తి చేసి పూర్తిగా రాజకీయాల పైన ప్రజాసేవకే దృష్టి సారిస్తారని తెలుస్తుంది.




























