దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కాబోతోంది. ఈసారి విడుదల తేదీలో ఎటువంటి మార్పులు కూడా ఉండదు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కాకముందే సోషల్ మీడియాలో 45 నిమిషాల ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. ఈ వీడియో ఫై టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే సంక్రాంతికి విడుదల కానున్న రెండు భారీ చిత్రాలు పోస్ట్ పోన్ అవుతున్నట్లు సమాచారం. ఒకేసారి రెండు సినిమాలు విడుదల చేయడం వల్ల చాలా కష్టం చేకూరుతుందని భావించి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తమ చిత్రాలను విడుదల చేయడానికి వెనక్కి తగ్గారని తెలుస్తోంది. అందరికంటే ముందుగా మహేష్ బాబు సంక్రాంతి కానుకగా సర్కారు వారి పాట సినిమా విడుదల చేయాలని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రభాస్ ఏకంగా తేదీతో సహా రాధేశ్యామ్ పోస్టర్ విడుదల చేశారు.
ఇక పవన్ కళ్యాణ్ కూడా భీమ్లా నాయక్ సినిమాను జనవరి 12 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో జనవరి 12న బీమ్లా నాయక్, 13న సర్కారు వారి పాట, 14న రాధేశ్యామ్ సినిమా విడుదల కానున్నట్లు స్పష్టత వచ్చింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా విషయానికి వస్తే. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల చేయాల్సి ఉండగా కరోనా మహమ్మారి వల్ల విడుదల తేదీ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు జనవరి 7న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు చిత్రబృందం.
అయితే పవన్, మహేష్ సినిమాల విడుదలకి ఒక వారం ముందు ఆర్ఆర్ఆర్ విడుదల చేసేలా తెలివిగా ఆలోచించారు రాజమౌళి. ఇక ఏక కాలంలోనే ఇలా భారీ సినిమాలు విడుదల కావడంతో చాలా నష్టం చేకూరుస్తుంది. ఈ విషయం పట్ల చిత్ర నిర్మాతల మధ్య చర్చలు జరిగాయని, పవన్, మహేష్ బాబు సినిమాలను ఫిబ్రవరి లేదా మార్చి కి పోస్ట్ పోన్ అయినట్టు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ప్రభాస్ మాత్రం ఈ విషయం పట్ల వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. అనుకున్న తేదీకే రాధేశ్యామ్ సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.



























