Rx100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల… కాదు కాదు ముఖ్యంగా కుర్రకారు హృదయాలను దోచుకున్న ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాలో పాయల్ సొగసు చూసి కుర్రకారు కు నిద్రలేకుండా చేసింది. అయితే ఆ సినిమా తరువాత సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. మొన్నీమధ్యే విక్టరీ వెంకటేష్ సరసన “వెంకీ మామ” సినిమాలో ఆడి పడింది కానీ ఎందుకో ఈ అమ్మడుకు పెద్దగా క్రేజ్ తెచ్చిపెట్టలేకపోయింది. అయితే ఎలాగైనా టాలీవుడ్ లో నిలదొక్కుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది కానీ పాపం ఈ అమ్మడుకి లక్ కలిసి రావడంలేదు. అయితే తాజగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ అందరికి ఒక్కసారికి బాంబ్ పేల్చింది.

తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తూ కుర్రకారుకి షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో తన ప్రియుడు సౌరబ్ డింగ్రా ను పరిచయం చేస్తూ అతడితో కలిసి ఉన్న ఫోటోలను పెట్టింది. అతడి భుజాలపై వాలిపోయి సెల్ఫీలు తీసుకుంది. ఈ అమ్మడు ముంబై లోనే ప్రేమలో పడిపోయిందట. ఇద్దరు కొన్ని రోజులుగా డేటింగ్ చేస్తున్నారు. అంతేకాదు ఒకరంటే ఒకరికి ప్రాణం అని చెబుతోంది ఈ ముద్దగుమ్మ. ఇద్దరిమధ్య ఉన్న అనుబంధాన్ని పాయల్ ట్విట్టర్ లో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంది. త్వరలో ఇతడిని పెళ్లి చేసుకుంటానని చెబుతోంది ఈ బ్యూటీ.




























