‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంలో తన అందచందాలతో తెలుగునాట కుర్రకారు హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుంది పాయల్ రాజ్‌పుత్.. ఆ ఒక్కసినిమా తో ఆమె సంచలనమే సృష్టించింది. ఒక్క సినిమాతో పాయల్ రాజ్‌పుత్ పేరు మారుమ్రోగిపోయింది. అయితే ఆ సినిమా తరువాత ఆమెకు ఊహించినన్ని అవకాశాలు రాలేదనే చెప్పాలి. మొన్నీమధ్యనే విక్టరీ వెంకటేష్ సరసన ‘వెంకీమామ’, మాస్ మహారాజ్ రవితేజ తో “డిస్కోరాజా” వంటి సినిమాల్లో నటించిన అవి కూడా ఆమెకు నిరాశనే మిగిలిచ్చాయి.. అదంతా అలా ఉంటే.. పాయల్ కు అతిలోక సుందరి శ్రీదేవి అంటే చాలా ఇష్టమట.

ఆమెకు శ్రీదేవి బయోపిక్ లో శ్రీదేవి పాత్ర పోషించాలని కోరికగా ఉందట.. ఈ విషయంపై పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ.. ‘తనకు చిన్ననాటి నుంచి శ్రీదేవి అంటే చాలా అభిమానమని, ఆమెకు వీరాభిమానిని అంటూ చెబుతోంది ముద్దుగుమ్మ.. ఈ క్రమంలో ఆమె బయోపిక్ లో శ్రీదేవిగా నటించాలనేది నా కల. ఒకవేళ అటువంటి అవకాశం వస్తే నా అంతటి లక్కీ ఇంకెవరు ఉండరు’ అని తెలిపింది.. ప్రస్తుతం పాయల్ ప్రముఖ దర్శకుడు జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ‘నరేంద్ర’ అనే చిత్రంలో నటిస్తోంది.




























