మెగా ఫ్యాన్స్‌కి ఓ బ్యాడ్ న్యూస్.. ఓ గుడ్ న్యూస్. కొణిదల వారసురాలు.. మెగా డాటర్ నిహారిక నటనకి గుడ్ బై చెప్పేసింది. ‘ముద్దపప్పు ఆవకాయ్’ అనే వెబ్ సిరీస్ తో బాగా పాపులరైన నిహారిక ‘ఢీ’ రియాలిటీ షోతో బుల్లితెరపైన మెరిసింది. ఆ తర్వాత మెగా వారసత్వాన్ని అందిపుచ్చుకుని బుల్లితెర నుండి వెండితెరకు పరిచయమైన నిహారిక.. ‘ఒక మనసు’ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ సరైన హిట్ కొట్టలేకపోయింది నిహారిక.

నిహారిక సినిమాల్లోకి వస్తున్నప్పుడే చాలా మంది మెగా ఫ్యాన్స్ నుండి వ్యతిరేకత ఎదురయ్యింది. అంతేకాకుండా నిహారిక హీరోయిన్ నటించిన చిత్రాల్లో ఏ ఒక్కటి కూడా హిట్ కాకుండా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ కావడంతో నిహారిక ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు, అలాగే పెళ్లి తరువాత సినిమాల్లో నటించకూడదని ముందుగా కండీషన్ పెట్టడం వలనే నిహారిక తన సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పినట్టు సోషల్ మీడియా కోడై కూస్తుంది.

అయితే మెగా ఫాన్స్ కు మరో గుడ్ న్యూస్ ఏమిటంటే.. నటనకు స్వస్తి చెప్పిన నిహారిక నిర్మాతగా మారనుందట. నిహారిక సినిమాల్లోకి రాకముందు ఆమెకు బాగా పేరు తీసుకొచ్చిన వెబ్ సిరీస్‌తోనే తిరిగి ప్రేక్షకులను మెప్పించడానికి నిర్మాత అవతారం ఎత్తబోతుందట నిహారిక. ఇప్పటికే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బేనర్‌పై వెబ్ సిరీస్‌లు చేసిన నిహారిక ఇదే బ్యానర్‌లో సొంతంగా సినిమాలు చేయబోతుందట. ‘ముద్దపప్పు ఆవకాయ్’ వెబ్ సిరీస్‌తో క్రేజ్ సంపాదించిన నిహారిక.. దర్శకుడు ప్రణీత్‌తో మరోసారి వెబ్ సిరీస్ నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తుందట. అయితే ఇందులో నిహారికతో పాటు నాగబాబు కూడా నటించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

నిహారిక రియల్ లైఫ్ ఫాదర్, రీల్ లైఫ్‌లో కూడా ఫాదర్ గానే నటిస్తున్నారని.. తండ్రీ కూతుళ్ల మధ్య జరిగే డ్రామాగా ఈ వెబ్ సిరీస్ ఉండబోతుందని తెలుస్తోంది. అయితే సినిమాలకు స్వస్తి చెప్పాలనే నిర్ణయానికి వచ్చిన నిహారిక ఈ వెబ్ సిరీస్‌లో నటిస్తుందా? లేక నిర్మాతగానే కొనసాగుతుందా అన్నది ఆసక్తిగా మారింది. వీటిన్నింటికీ త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.



























