దేశంలో కరోనా మహమ్మారి తన పంజా విసురుతుంది. రోజు రోజుకే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే కేంద్ర ముందే తేరుకుని లాక్ డౌన్ ప్రకటించి మంచికే అయినా.. ఈ లాక్ డౌన్ తో కొందరు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి లేక, ఇంటి అద్దెలు కట్టలేక సొంతూళ్లకు వెళ్ళడానికి నానా తంటాలు పడుతున్నారు. కొంతమంది కళ్ళు అరిగిపోయేలా కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళుతున్నారు. ఆ ప్రయత్నంలో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక మరికొందరు అయితే ఇంకొంచెం ముందుకు వెళ్లి భారీ స్కెచ్ లే వేస్తున్నారు. అదే క్రమంలో సొంతూరికి వెళ్ళడానికి శవం గెటప్ వేసాడు జమ్మూకాశ్మిర్ లోని ఒక వ్యక్తి.

జమ్మూకాశ్మిర్ పూంఛ్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులు కలిసి సొంతూరికి వెళ్లడానికి భారీ స్కెచ్ చేసారు. వారిలో ఒకరు చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికెట్ తీసుకుని తమ గ్రామానికి వెళ్లేందుకు అంబులెన్స్ అద్దెకు తీసుకున్నారు. అనుకున్నదే తరువుగా ఆ అంబులెన్స్ లో ఊరికి బయలుదేరారు. దారిలో వచ్చిన అన్ని చెక్ పోస్టుల వద్ద తమ స్నేహితుడు చనిపోయాడని, శవాన్ని గ్రామానికి తీసుకెలుతున్నామని పోలీసులకు చెప్పుకుంటూ వచ్చారు. అయితే సురాన్ కోట్ చెక్ పోస్టు వద్ద పోలీసులకు కూడా అదే తరహా స్టోరీ చెప్పారు. కానీ అక్కడి పోలీసులకు వారి మాటలపై అనుమానం రావడంతో అంబులెన్స్ లో తనిఖీలు చేసారు. అందులో శవంలా పడి ఉన్న వ్యక్తి టెంపరేచర్ చుస్తే బ్రతికి ఉన్నాడని తెలిసిపోయింది. దీనితో షాక్ అయిన పోలీసులు ఆ ముగ్గురితో పాటు, అంబులెన్స్ డ్రైవర్ ని, అతని సహాయకుడిని కలిపి మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసారు. వారిపై సెక్షన్ 420, 269, 180 కింద కేసు నమోదు చేసారు.




























