Ping Pong Surya : తపన సినిమాతో తెలుగులో పరిచయమైన పింగ్ పాంగ్ సూర్య రాజమౌళి ‘సై’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా విజయంతో ఇండస్తీలో మంచి అవకాశాలను అందుకుని హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లను చేస్తూ కేరర్ నిర్మించుకున్న సూర్య సై సినిమా తరువాత పింగ్ పాంగ్ సూర్య గా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక చిరంజీవి గారి సినిమా ‘జై చిరంజీవ’లో చిన్న పాత్ర చేసినా మంచి పేరు వచ్చింది. రాజమౌళి, చంద్ర సిద్ధార్థ, కరుణాకరణ్ వంటి దిగ్గజ దర్శకులతో పనిచేసిన సూర్య తన సినిమా కష్టాలను, అలాగే డైరెక్టర్స్ దగ్గర తాను నేర్చుకున్న విషయాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

యశో సాగర్ కి ఎలాంటి అలవాట్లు లేవు…
కన్నడ ప్రొడ్యూసర్ కొడుకు యశో సాగర్ ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ తొలిప్రేమ సినిమా డైరెక్టర్ కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’. ఈ సినిమాలో స్నేహ ఉల్లాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో హీరో స్నేహితుడి పాత్రలో పింగ్ పాంగ్ సూర్య నటించారు. యశో సాగర్ యాక్సిడెంట్ లో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆయన గురించి సూర్య మాట్లాడుతూ చాలా సైలెంట్ గా, డైరెక్టర్ చెబితే మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ చాలా డెడికేటెడ్ గా పనిచేసేవాడు. ఇక అసలు ఎలాంటి చెడు అలవాట్లు లేవు అంటూ చెప్పారు. మందు అలవాటు, కనీసం సిగరెట్ అలవాటు కూడా లేదు అంటూ చెప్పారు.

నేను ఏ హత్య చేయలేదు…
సినిమా ఫైనాన్సింగ్ కోసం రాకేష్ రెడ్డి అనే వ్యక్తిని కలవడం వల్ల అనుకోకుండా హత్య కేసులో ఇరుక్కోవడం అన్నీ సూర్య జీవితంలో జరిగాయి. సూర్య ఆ కేసు గురించి మాట్లాడుతూ నేనే ఆయనకు కాల్ చేసి ముందు రోజు వెళ్ళాను, చంపాలని హనీ ట్రాప్ చేసి అలా చేసుంటే అలా నేనే కాల్ చేసి ఎందుకు వెళతాను, నేను ఏ తప్పూ చేయలేదు అందుకే భయపడలేదు అంటూ చెప్పారు. ఇక కేసులో ఏ5 గా ఉన్న సూర్యను మీడియాకి చెందిన కొంతమంది 25 లక్షలు ఇస్తే కేసు నుండి తప్పిస్తామని ఆఫర్ కూడా ఇచ్చారట. అయితే నేను ఏ తప్పూ చేయకుండా అలా డబ్బు ఇచ్చి బయటికి రావాల్సిన పని లేదు అంటూ సూర్య చెప్పారు.



























