Actress Meena: బాలనటిగా ఎన్నో తమిళ సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి మీనా అనంతరం వెండితెర హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.తెలుగు తమిళ ఇండస్ట్రీలలో అగ్ర హీరోల సరసన నటించిన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. దంపతులకు నైనిక అనే ఒక కుమార్తె ఉంది.

ఇలా మీనా భర్త కూతురుతో తన జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.భర్త ప్రోత్సాహంతోనే తిరిగి ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన మీనా జీవితం ఎంతో హ్యాపీగా ఉంది అనుకునే సమయంలో ఆమె భర్త మృతి చెందడం అందరిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మీనా మృతి చెందడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. అయితే ఈయన మరణానికి కారణం ఇదే అంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విద్యాసాగర్ కు మొదటి నుంచి ఊపిరితిత్తుల సమస్య ఉందని అయితే పావురాలతో ఎక్కువగా ఉండటం వల్ల ఆయనకు ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువ అయ్యి మృతి చెందారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఆయన పోస్ట్ కోవిడ్ సమస్యలతో కూడా బాధపడుతున్నారని, ఈ సమస్యలు తీవ్రతరం కావడంతోనే విద్యాసాగర్ మృతి చెందాడనే వార్తలు వినిపించాయి. ఇలా తన భర్త మృతి గురించి ఎన్నో రకాల వార్తలు రావడంతో మొదటిసారిగా తన భర్త మృతి పట్ల ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.
నాకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు…
ఈ సందర్భంగా మీనా స్పందిస్తూ.. ప్రస్తుతం తన కుటుంబం మొత్తం ఎలాంటి పరిస్థితులలో ఉందో అందరికీ తెలిసిందే ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మా ప్రైవసీకి భంగం కలిగించవద్దని అలాగే తన భర్త మరణం గురించి అసత్య ప్రచారాలు చేయకండి అంటూ ఈమె అందరిని వేడుకున్నారు. ఇలాంటి కఠిన తరమైన పరిస్థితిలో ఉన్న సమయంలో నాకు తోడుగా నిలిచిన మిత్రులకు అభిమానులకు అలాగే వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, ఐఏఎస్ రాధాకృష్ణన్ గారికి ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా ఈమె ఎమోషనల్ పోస్ట్ చేశారు.































