దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ లతో సహా పలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో అయన మాట్లాడుతూ దేశాన్ని లాక్ డౌన్ నుంచి కాపాడాలని అన్నారు.

“యువకులు గ్రూపులుగా ఏర్పడి కరోనా నిబంధనలు అమలయ్యేలా చూడాలి”. దీనివల్ల కంటైన్మేంట్ జోన్లు, లాక్ డౌన్లు పెట్టాల్సిన అవసరం రాదు ఆని సూచించారు. అదే విధంగా రాష్టాలు కూడా లాక్ డౌన్ ను చివరి అస్త్రంగానే పరిగణించాలి అని ప్రధాని ప్రసంగంలో తెలిపారు.































