Pokiri Movie : తెలుగు సినీ చరిత్రలోనే రికార్డులు క్రియేట్ చేసిన సినిమా నందమూరి తారక రామరావు గారు నటించి దర్శకత్వం వహించిన ‘దానవీరశూరకర్ణ’. దీనికి ఎన్టీఆర్ దర్శకత్వం వహించడం ఒక ఎత్తు అయితే ఇందులో మూడు పాత్రలలో అయన నటించడం మరో ఎత్తు. 10 లక్షల రూపాయల కన్నా తక్కువ బడ్జెట్ తో 1977 లో వచ్చిన ఈ సినిమా కోటి రూపాయలకు పైగా వసూళ్ళను రాబట్టి అప్పట్లో సంచలం సృష్టించింది. ఒకటా రెండా ఈ సినిమా గురించి చెప్పుకుంటూ పోతూ అలా చెబుతూనే ఉంటాము.

అపుడు దానవీరశూరకర్ణ, ఇపుడు పోకిరి…
దానవీరశూరకర్ణ సినిమాని 1994లో భారీ ఎత్తున రీ రిలీజ్ కూడా చేశారు. 17 ఏళ్ళ తర్వాత విడుదలైన పాత చిత్రానికి కూడా 60 లక్షలకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేయడం అప్పట్లో ఇండస్ట్రీ రికార్డు. రీ రిలీజ్ అవ్వడం మాత్రమే కాదు స్పెషల్ షోలు, దండలు, వూరేగింపులు ఇలా చాలా హడావుడి జరిగింది. అయితే రెండవ సారి విడుదల చేసినా కూడా కోటి రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అయితే ఇపుడు పోకిరి సినిమా కూడా ఇలాంటి రికార్డు క్రియేట్ చేసింది.

పోకిరి సినిమాను నిన్న కేవలం సాయంత్రం మాత్రమే వేసిన స్పెషల్ ప్రీమియర్లకు మంచి ఆదరణ లభించింది. ఒక్క ఆర్టిసి క్రాస్ లోనే 6 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చిందంటే అది మామూలు విషయం కాదు. ఇక వరల్డ్ వైడ్ గా 200 థియేటర్ లలో విడుదల చేశారు కాబట్టి మూడు కోట్లకు పైగానే కలెక్షన్ ఉంటుందని ట్రేడ్ వర్గాల అభిప్రాయం. దానవీరశూరకర్ణ రెండవసారి విడుదల సంచలనం తర్వాత ఘరానా మొగుడు, తొలిప్రేమ వంటి చాలా సినిమాలు రీ రిలీజులు జరుపుకున్నా అంతటి రికార్డు సృష్టించింది మాత్రం పోకిరి సినిమానే.



























