మన సమాజంలో పోలీసులకు ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఉందో మనకు తెలిసిందే. ఏ చిన్న సమస్య ఎదురైనా, ఎటువంటి అన్యాయం జరిగిన ప్రజలు వెళ్లి ముందుగా పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటారు.అయితే ఈ విధంగా పోలీసుల వద్దకు న్యాయం కావాలని వచ్చిన ప్రజల పట్ల పోలీసుల ప్రవర్తన ఏ విధంగా ఉందో తెలుసుకోవడం కోసం ఏకంగా పోలీస్ కమిషనర్ మారువేషంలో పోలీస్ స్టేషన్ సందర్శించి ఫిర్యాదులు చేసిన ఘటన తాజాగా చోటు చేసుకుంది.

మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడా కమిషనరేట్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీస్ కమిషనర్ కృష్ణ ప్రకాష్ మారువేషంలో పోలీస్ స్టేషన్లకు వెళ్లి పోలీసుల పనితీరు గమనించాడు. కేవలం కమిషనర్ కృష్ణ ప్రకాష్ మాత్రమే కాకుండా అతని భార్య అసిస్టెంట్ కమిషనర్ ప్రేర్నా కట్టే మారు వేషంలో పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరిగింది.కృష్ణ ప్రకాష్ మారువేషంలో మొదట రెండు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయగా అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది వెంటనే స్పందించి సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితులను గమనించారు. కానీ మూడవ పోలీస్ స్టేషన్ కు వెళ్ళినప్పుడు స్పందించకపోవడంతో తన అసలు రూపం చూపించాడు.

మొదటి రెండు పోలీస్ స్టేషన్లకు వెళ్లిన సూర్య ప్రకాష్ మొదటిగా కొంతమంది దుండగులు తన భార్యని వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే స్పందించారు. రెండవ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు తన భార్య మెడలో గొలుసు ఎవరో దొంగలించారని ఫిర్యాదు చేయగా అక్కడ కూడా పోలీసులు వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను ఆరా తీశారు.

ఇక మూడవ సారీ పింప్రి పోలీస్ స్టేషన్‌కి మారు వేషంలో వెళ్లి కరోనా పెషేంట్‌ను తరలించడానికి అంబులెన్స్ డ్రైవర్ 8 వేల రూపాయలు లంచం అడుగుతున్నారని ఫిర్యాదు చేయగా అందుకు పోలీసులు ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించి అది తమ స్టేషన్ పరిధిలోకి రాదని ఆ పరిధిలో పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయాలని సమాధానం చెప్పడంతో కృష్ణ ప్రకాష్ అసలు రూపం చూపించి పోలీస్ స్టేషన్ అధికారులపై వేటు వేశారు. మిగిలిన రెండు పోలీస్ స్టేషన్ లోని పోలీసులపై కమిషనర్ కృష్ణ ప్రకాష్ ప్రశంసలు కురిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here