Political Analist K.S. Prasad : వివేకానంద రెడ్డి హత్యకు నవీన్ కు మధ్య లింకేంటి?? ఎవరీ నవీన్, అసలు ఏంటి కథ…: పొలిటికల్ అనలిస్ట్ కే.ఎస్ ప్రసాద్

0
130

Political Analist K.S. Prasad : 2019 ఎన్నికల ముందు రాష్ట్రంలో సంచలనం రేపిన హత్య కేసు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. తన ఇంట్లోనే రాత్రి బాత్రూంలో శవమై కనిపించారు వివేకానంద రెడ్డి. ఈ హత్య మీద విచారణ తొలుత రాష్ట్ర పోలీసులు చేసినా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానంతో వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కోర్ట్ ను ఆశ్రయించి పక్క రాష్ట్రం అయిన తెలంగాణకు కేసును సిబిఐ కి ట్రాన్సఫర్ చేయించుకున్నారు. జగన్ సొంత బాబాయ్ హత్య, చేతిలో అధికారం, అయినా కేసులో ఒక్క అడుగు ముందుకు పడకపోవడం అందరినీ ఆశ్చర్యం కలిగించే అంశం. ఈ కేసు ఎన్ని రోజులుగా నత్తనడకన సాగుతున్నా ప్రస్తుతం ఒక ఫోన్ కాల్ లీక్ తో కొత్త ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ విషయాల మీద పొలిటికల్ అనలిస్ట్ కే.ఎస్ ప్రసాద్ విశ్లేషించారు.

నవీన్ ని కావాలని ఈ కేసులో పెడుతున్నారు…

ప్రసాద్ గారు మాట్లాడుతూ వ్యవస్థలు సక్రమంగా పనిచేసి ఉంటే వివేకానంద రెడ్డి హత్య కేసు నాలుగేళ్లు సాగదు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ, కేసు మొదట్లోనే సరిగా పోలీసులు పనిచేసుంటే ఈపాటికి కేసు ముగిసేది. అపుడు పట్టించుకోకున్నా ఇపుడు ఈ కేసులో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తే ఏమీ ఒరగదు అంటూ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. డైలీ సీరియల్ లో జనాలకు బోర్ కొడుతోంది అన్న సమయంలో కొత్త పాత్రను తెర మీదకు తెచ్చినట్లు ఇపుడు ఈ కేసులో నవీన్ అనే క్యారెక్టర్ ను ఎంటర్ చేసారు. ఒక సెలబ్రిటీనో రాజకీయ నాయకుడో బిజీ ఉన్నాడు అంటే అతని వద్ద పనిచేసే డ్రైవర్ అలా ఎవరో ఒకరి నెంబర్ కి కాల్ చెస్తారు కావలిసిన వాళ్ళు అది సాధారణంగా జరిగే విషయమే. అతనికి కాల్స్ వెళ్లాయని ఇక అతనికి ఈ హత్యకి సంబంధం ఏమిటి అంటూ అరా తీయడం విడ్డూరంగా ఉంది. అసలు ఏ కేసులో ఎవరిని విచారించాలో అందరికీ తెలుసు, వారిని పట్టుకుని ప్రశ్నిస్తే కేసు క్లోజ్ అవుతుంది కానీ అలా చేయరు. ఇలా కేసు సాగదీస్తూనే ఉంటారు.

ఈ కేసు వల్ల జగన్ కి జరిగే ప్రమాదం ఏమీ లేదు కేవలం వివేకానంద రెడ్డి గారి అమ్మాయి సునీత తిరుగుతున్నారు అంతే అంటూ చెప్పారు ప్రసాద్. ఇక చంద్రబాబు ఇపుడు ఈ హత్య మీద ఆరోపణలు చేయకుండా అధికారంలో ఉన్నపుడే వివేకానంద రెడ్డిని హత్య మీరే చేశారు అంటూ నరకాసుర హత్య అని హెడ్డింగ్ పెట్టిన పత్రికల వాళ్ళను, ఆ ఆర్టికల్ రాసినవారిని ఆరోజే పోలీస్ స్టేషన్ లో విచారించి ఉంటే బాగుండేది. ఏ ఆధారాలతో అలా రాసారు అని నిలాదీసుంటే బాగుండేది అంటూ అభిప్రాయపడ్డారు. ఇక ఈ కేసులో కొత్త పేర్లు వినిపిస్తూ కొత్తమలుపులు తిరగడమే కానీ కేసులో అసలు దోషులు తేలరు అంటూ చెప్పారు.