Political Analyst Ankamma Rao : ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం మీద ఎందుకింత రాజకియం…: పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మ రావు

0
31

Political Analyst Ankamma Rao : ఎన్టీఆర్ శత జయంతి సందర్బంగా ప్రస్తుతం బీజేపీ లో కొనసాగుతున్న ఎన్టీఆర్ గారి కుమార్తె పురందేశ్వరి చొరవతో ఆర్బిఐ 100 రూపాయల నాణెం ను విడుదల చేసింది. రాష్ట్రపతి ద్రౌపది మూర్ము గారు నాణెంను విడుదల చేయగా ఈ వేడుకలో నందమూరి కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. అయితే భార్యగా తాను పాల్గొనవలసిన హక్కు తనకు ఉందంటూ లక్ష్మి పార్వతి ఏకంగా రాష్ట్రపతికి లేఖ రాయగా అసలు నాణెం ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదని అది ఒక ప్రైవేట్ కార్యక్రమం అనే విషయాలు బయటికి వస్తున్నాయి. ఇక ఈ ఇష్యూ మీద పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మ రావు గారు మాట్లాడారు.

నాణెం మీద రాజకీయాలు ఎందుకు…

అంకమ్మ రావు గారు ఎన్టీఆర్ వందరుపాయల నాణెం గురించి మాట్లాడుతూ ఆయన నాణెం ను కేంద్రం విడుదల చేయడం తెలుగు వారికీ గర్వకారణం ఆ విషయం వదిలేసి లక్ష్మి పార్వతి నన్ను పిలవలేదు నేను ఆయన భార్యని అంటూ మీడియాకెక్కడం బాగోలేదు. ఎన్టీఆర్ గారి కూతురు పురందేశ్వరి, అల్లుడు చంద్రబాబు గురించి విమర్శించడం ఎందుకు కేంద్ర కార్యక్రమం కి వాళ్లకు ఏమిటి సంబంధం అంటూ అంకమ్మ రావు గారు మాట్లాడారు.

నేను ఆయన భార్యని అంటూ ఆమె చెప్పుకోవడమే కానీ ఏపీ లో ఎవరు ఆ విషయాన్ని అంగీకరించరు. నిజంగా ఎన్టీఆర్ భార్య గా ఆయన మీద గౌరవం ఉండి ఉంటే ఆయన హెల్త్ యూనివర్సిటీ రాష్ట్రానికి తీసుకువస్తే నువ్వున్న పార్టీ, పదవులు పొందిన పార్టీ వాళ్ళే పేరు మారుస్తుంటే పోరాడలేదు మళ్ళీ భార్యని అంటూ హక్కుల గురించి మాట్లాడుతున్నావ్ అంటూ అంకమ్మ రావు ఫైర్ అయ్యారు.