Political analyst Ankamma rao : ఏపి రాజకీయాల్లో ప్రతిపక్ష నేతల విమర్శలను తీసుకోవడం ఏమాత్రం సహించని వైసీపీ పార్టీ వారి మీద మాటల దాడి ఇన్నాళ్లు చేసింది. అయితే రాయలసీమ నీటి ప్రాజెక్టూల సందర్శన అనే పేరుతో యాత్ర చేపట్టిన చంద్రబాబు యాత్రకు పుంగనూరు లో కార్యకర్తల దాడి చంద్రబాబు మీద రాళ్లతో దాడి చేయించి పైగా అది టీడీపీ కార్యకర్తల దాడి అంటూ విమర్శిస్తున్నారంటు పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మ రావు తెలిపారు. చంద్రబాబు మీద దాడి చేయించి మళ్ళీ ఆయన మీదే పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసారు అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు మీద దాడి చేసింది వాళ్ళే…
చంద్రబాబు రాయలసీమ టూర్ లో అసలు పుంగనూరు కి వెళ్లాలానే ప్లాన్ లేదు. అంతకు ముందు మొలకల చెరువు సభలో వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. పోలీసులు చోద్యం చూస్తున్నట్లు చూడకపోతే అలా రెచ్చగోడుతున్న వారిని నియంత్రించాలి కానీ పోలీసులు కూడా వైసీపీ వాళ్ళతో కలిసిపోయి మరి ఇలా ఇరువర్గాలు కొట్టుకునే వరకు చూస్తూ ఉన్నారు. చాలా వీడియోలు బయటికి వచ్చాయి. బైకుల మీద వెళుతు వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టేలా ప్రవర్తించడం కనిపిస్తుంది. కానీ ఎస్పీ టీడీపీ వాళ్ళదే తప్పు అన్నట్లుగా మాట్లాడారు.

ఆ ఊరి నుండి అంగల్లు మీద పుంగనూరు వెళ్లాలని ఆయన అనుకోలేదు. అయితే ఆయనని చూడటానికి అక్కడి ప్రజలే బైపాస్ మీదకి వచ్చినపుడు వైసీపీ వాళ్ళు రెండోందల మంది వచ్చి మళ్ళీ గొడవ చేసారు ఆ సమయంలోనే పోలీసుల మీద దాడి జరిగింది. అయితే పోలీసులు 2000 మందిని నియంత్రించడం సులభమా లేక రెండోందల మందిని నియంత్రించడం సులభమా. పైగా ఎస్పీ రిశాంత్ రెడ్డి చంద్రబాబు కావాలనే పుంగనూరు ఆయన షెడ్యూల్ లో లేకపోయినా వచ్చారంటు చెబుతున్నారు. చంద్రబాబె చెప్పారు నేను పుంగనూరు రావడం లేదని మళ్ళీ ఆయన వచ్చాడంటూ అపద్దలు చెప్తున్నారు. పోలీసులు, వైసీపీ ప్రభుత్వ తో కలిసి కావాలనే ప్లాన్ చేసారనిపిస్తుంది అంటూ అంకమ్మ రావు తెలిపారు.