Ponnambalam: రెండు లక్షలు ఇస్తారు అనుకుంటే 40 లక్షలు ఇచ్చి ప్రాణం కాపాడారు: పొన్నం బలం

0
27

Ponnambalam:ఎన్నో తెలుగు తమిళ సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు పొన్నం బలం గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చాలా దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారన్న విషయం మనకు తెలిసిందే.. అయితే ఈయన చికిత్సకు కూడా డబ్బులు లేకపోవడంతో పలువురి ఆర్థిక సహాయంతో ఈయన చికిత్స చేయించుకున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మాట్లాడుతూ… కిడ్నీ ఫెయిల్యూర్ కావడంతో తరచూ డయాలసిస్ చేయించుకోవడానికి సరైన డబ్బు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న తనని ఒక రోజు తన అల్లుడు ఆంజనేయస్వామి గుడికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేయించారని తెలియజేశారు. ఆ సమయంలో పూజారి పూజ చేస్తూ చిరంజీవి అనడం నాకు వినిపించింది ఆ క్షణమే చిరంజీవి గారిని సహాయం అడగాలన్న ఆలోచన నాకు కలిగిందని తెలిపారు.

తన స్నేహితుడి సహాయంతో చిరంజీవి గారి నెంబర్ తీసుకొని తనని కాంటాక్ట్ అయ్యి నా పరిస్థితి వివరించాను.చిరంజీవి గారు కూడా నాకు సహాయం చేస్తానని చెప్పారు. అయితే ఆయన సహాయం చేస్తాను అంటే ఏదో రెండు లక్షలు లేదా మూడు లక్షలు సహాయం చేస్తారని అనుకున్నాను కానీ ఏకంగా 40 లక్షల రూపాయలు సహాయం చేసిన ప్రాణాలను కాపాడుతారని అస్సలు ఊహించలేదని పొన్నం బలం తెలిపారు.

Ponnambalam: దేవుడే చిరంజీవి రూపంలో వచ్చారు…


చిరంజీవి గారు మంచి మనసు కారణంగానే ఆయన చేసిన సహాయం కారణంగానే నేడు ఈరోజు ప్రాణాలతో బ్రతికి ఉన్నానని నిజంగా ఆ దేవుడే చిరంజీవి రూపంలో వచ్చి నాకు సహాయం చేసి నా ప్రాణాలను కాపాడారంటూ ఈ సందర్భంగా చిరంజీవి చేసిన సహాయం గురించి పొన్నం బలం మరోసారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అతనిపై ప్రశంసలు కురిపించడమే కాకుండా తనకు రుణపడి ఉంటానని తెలియజేశారు.