Pooja Ramachandran: నిఖిల్ హీరోగా నటించిన స్వామి రారా సినిమాలో నిఖిల్ స్నేహితురాలు పాత్రలో నటించిన పూజ రామచంద్రన్ ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత త్రిపుర, దోచేయ్, వెంకీ మామ, కాంచన 2 వంటి సినిమాలలో కీలకపాత్రలలో నటించింది. ఇక తమిళ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న పూజా రామచంద్రన్ కి ఆ షో ద్వారా మంచి గుర్తింపు లభించింది.
ఆ తర్వాత ప్రముఖ నటుడు జాన్ కొక్కెన్ ని వివాహం చేసుకుంది. వీరసింహారెడ్డి, కేజిఎఫ్, కబ్జా, వంటి పలు సినిమాలలో జాన్ కొక్కేన్ విలన్ గా నటించి మెప్పించాడు..ఇదిలా ఉండగా పూజ రామచంద్రన్ తాజాగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె భర్త జాన్ కొక్కెన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.జాన్ కొక్కెన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటాడు.
ఈ క్రమంలో భార్య సీమంతం వేడుకలకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో ఇటీవల షేర్ చేశాడు. ఇక తాజాగా పూజా రామచంద్రన్ మగ బిడ్డకు జన్మనివ్వటంతో ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ బాబు వేలిని పట్టుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
దీంతో స్నేహితులు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం జాన్ కొక్కేన్ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో తన పట్ల ప్రేమ , అభిమానం చుపినందుకు జాన్ కొక్కెన్ కూడా అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశాడు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…