తెలుగు సినీ ఇండస్ట్రీలో పూనమ్ కౌర్ గురించి తెలియనివారు ఎవరు ఉండరు. ఆమె తెలుగులో హీరోయిన్ గా చేసిన సినిమాలు కంటే సెకండ్ హీరోయిన్ గా మరియు ప్రత్యేక పాత్రలలో నటించిన సినిమాలే ఎక్కువ. కానీ సినిమా విషయాల కంటే ఈ భామ వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటూ వస్తుంది. ఆమె మీద వచ్చే వార్తలపై పూనమ్ స్పందించక పోవడంతో అభిమానులు కఫ్యూజ్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఆమె చేసిన కొన్ని ట్వీట్లు మాత్రం వివాదాస్పదం అయిన విషయం తెలిసందే..

తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. చిన్నప్పటి నుండి తిరస్కరణకు గురయ్యాడు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. “ఎదుగుతున్న వయసులో అకారణంగా ప్రేమకు గురయ్యాడు. చిన్ననాటి నుండి పెద్దయ్యేంత వరకు.. అతని ప్రయాణాన్ని నేను ఎంతగానో గౌరవిస్తున్నాను. స్వర్గంలో ఉన్న అయన తాత గారి ఆశీస్సులు అతనికి ఎల్లప్పుడూ ఉంటాయి. బెస్ట్ విషెస్” అంటూ పేరు ప్రస్తావించకుండా ఎన్టీఆర్ ని ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమెను తిడుతుంటే.. మరి కొందరు మాత్రం ఆమెను సమర్థిస్తున్నారు.
He has been denied love in his growing up years for no mistake of him …. from a child to a grown up …immensely respect his journey …… may be blessed with all the heart n blessing from the grand father up above the heaven….best wishes !❤️❤️❤️❤️
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) May 20, 2020




























