బాలీవుడ్ లో ఈ మద్య అడల్ట్ కంటెంట్ చిత్రాల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇలాంటి చిత్రాల్లో నటించడానికి బి గ్రేడ్ హీరోయిన్లు కూడా పోటీ పడి మరీ నటిస్తున్నారు. అలాంటి వారిలో పూనమ్ పాండే ఒకరు. ఈ అమ్మడి పేరు సినిమాల్లో కన్నా సోషల్ మీడియా ద్వారానే బాగా పాపులర్ అయ్యింది. తన మత్తెక్కించే హాట్ ఫోటోలు, బోల్డ్ వీడియోలతో ఎంతో మంది అభిమానుల మతి పోగొట్టిన ఈ భామ..

ఆమధ్య భారత జట్టు వరల్డ్ కప్ క్రికెట్ గెలిస్తే, న్యూడ్ ఫోటోలు దిగి కానుకగా పంపిస్తానని సంచలన ప్రకటనే చేసింది. అంతేకాకుండా సంవత్సరంలో వచ్చే ప్రతి ఈవెంట్ కి తనదైన శైలిలో హాట్ వీడియోలు, హాట్ హోత్బ్ ఫోటోలను ఏమాత్రం సిగ్గూ లేకుండా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. టాలీవుడ్ లో కూడా ఓ చిత్రంలో నటించిన పూనం పాండే తన ఫాన్స్ కు తన సెక్సీ ఫోటోలు, వీడియోలను వెతుక్కునే శ్రమ లేకుండా గూగుల్ ప్లే స్టోర్ లో తన పేరిట ఓ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చానని ఓ తీపి కబురు కూడా చెప్పింది. తన అందంపై తనకు నమ్మకముందని, అందాలున్నది అమ్ముకోవడానికేగా.?, తనకు ఏ హీరోయిన్ పోటీ కాదని..తన అందాలు ఆరాదించే వారు., అభిమానించేవాళ్లు చాలా మంది ఉన్నారని, అందాల ఆరబోతకు దిగే హీరోయిన్లకు, తనకు పోలికలే లేవని, వెండితెరపై వాళ్లు చేస్తున్నదే తాను సోషల్ మీడియాలో చేస్తున్నానని, అదేమీ పెద్ద తప్పు కాదని తెలివిగా చెబుతూ.. నిత్యం వివాదాలతో వార్తల్లో ఉండే బాలీవుడ్ బోల్డ్ నటి పూనం పాండే తాజాగా మరో వివాదంతో తెరపైకి వచ్చింది.

తన భర్త తనను లైంగికంగా వేధిస్తున్నారని, బెదిరింపులకు గురిచేస్తున్నారని పూనం ఇచ్చిన ఫిర్యాదుపై ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పూనం ప్రస్తుతం దక్షిణ గోవాలోని కనకోనా గ్రామంలో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గత కొంతకాలంగా ప్రేమిస్తున్న తన బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేను ఈ నెల 1న పూనమ్‌ పాండే పెళ్లి చేసుకుంది. తన భర్త సాం బాంబే తనను వేధిస్తున్నారని, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారని పూనం పాండే ఫిర్యాదు చేశారని, వెంటనే నిందితుడిని అరెస్ట్‌ చేశామని కనకోనా పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ తుకారాం చవాన్‌ చెప్పారు.

సాం బాంబేపై కేసు నమోదు చేసి బాధితురాలిపై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన మీడియాతో తెలియజేసారు. మోడల్‌ నుంచి నటిగా ఎదిగిన పూనం ఈనెల 10న తన పెళ్లి ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ బాంబే అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్‌ ఇచ్చిన పూనం ఇంతలోనే భర్తపై ఫిర్యాదు చేయడం, శాం బాంబేను పోలీసులు అరెస్ట్‌ చేయడం కొంతగా ఆశ్చర్యం కలిగిస్తోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here