Posani Krishna Murali : తెలుగులో రైటర్ గా పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ గా మొదలయి, అటు నటుడుగా ఇటు రైటర్ గా కొనసాగుతూ రెండింటిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి పోసాని కృష్ణ మురళి నిజానికి తెలుగు ప్రేక్షకులకు మెంటల్ కృష్ణ అని చెబితే బాగా గుర్తొస్తారు. విభిన్నంగా విలనిజం చూపిస్తాడు అలాగే విభిన్నంగా కామెడీ పండించగలడు. పరుచూరి బ్రదర్స్ తో పనిచేసే సమయంలోనే వర్మ సినిమాలో అవకాశం వచ్చినా పని పూర్తిగా నేర్చుకున్నాకే చేస్తానని చెప్పి తిరస్కరించిన పోసాని ఆ తరువాత గాయం, నాగార్జున రక్షణ వంటి సినిమాలతో రైటర్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఇక వెంకటేష్ పెళ్లిచేసుకుందాం, ప్రేమించుకుందాం రా వంటి సినిమాలకు పనిచేసారు. రాజకీయాల్లోనూ యాక్టీవ్ గా ఉన్న పోసాని గారు ప్రస్తుతం వైసీపీ కోసం పనిచేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్న ఆయన తన వ్యక్తిగత విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

నా భార్య ఏదీ పట్టించుకోదు…
రాజకీయాల్లో ఉన్నాక మన మీద మాత్రమే కాకుండా మన కుటుంబం మీద కూడా బురద జల్లుతారు. ఈ విషయం నా కుటుంబానికి తెలుసు అందుకే నేను నా కుటుంబం పెద్దగా పట్టించుకోము అంటూ తెలిపారు పోసాని. ఒకానొక సమయంలో పోసాని గారిని ఆయన భార్య కుసుమ లతను టార్గెట్ చేసి కొంత మంది తిట్టినపుడు వాళ్లకు కౌంటర్ వేస్తూ పరుశంగా పోసాని గారు అయన భార్యనే విమర్శించారు.

ఆ వీడియో మళ్ళీ ఆయన భార్యకు చూపించినా ఒకసారి మొహం చిట్లించినట్లు పెట్టి తరువాత టీ తాగుతారా అంటూ తన పని తాను చేసుకుంది. తాను ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోదు, కుటుంబంలో అందరూ అంతే అంటూ తెలిపారు పోసాని. తాను కూడా ఎవరినీ ఊరికే విమర్శించనని కారణం ఉంటేనే వాళ్ళు చేసింది తప్పు అనిపిస్తేనే మాట్లాడుతా అంటూ తెలిపారు.


































