Posani Krishna Murali : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్క్రిప్ట్ రైటర్ గా మొదలై చాలా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించిన పోసాని కృష్ణ మురళీ గారు రాజకీయాల్లోకి వచ్చి తన మాటలతో మరింత వైరల్ అవుతూ ఉంటారు. ఇక టాలీవుడ్ టాప్ హీరోస్ తో తాను చాలా సినిమాల్లో నటించారు. గాయం సినిమాతో మొదలై నేటి సర్కారు వారి పాట సినిమా వరకు చాలా సినిమాల్లో నటించారు. ఇక తాజాగా ఇంటర్వ్యూలో టాప్ హీరోస్ తో తన అనుభవాల్ని పంచుకున్నారు.

బాలకృష్ణ కి కోపం ఎక్కువ, చిరంజీవి అలా ఉంటారు…
ఇక బాలయ్యబాబు తో చాలా సినిమాల్లో నటించిన పోసాని ఆయనకి కోపం ఎక్కువ అంటూనే చాలా సరదాగా కలిసి పోతారని నిజాయితీ గల మనిషి అంటూ చెప్పారు. తన తండ్రి సీఎం అయినా అక్రమంగా సంపాదించలేదు. కేవలం నిజాయితీగా కష్టపడి సంపాదించుకున్నారు. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడరు, ముక్కుసూటిగా మాట్లాడుతారు అంటూ చెప్పారు. ఇక చిరంజీవి గారితో ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించిన ఆయన సెట్స్ లో చాలా బాగా ఉంటారంటూ చెప్పాడు. ఇక పవన్ కళ్యాణ్ తో నటించడం పట్ల కూడా స్పందించారు. నా సినిమా వరకు ఉంటానని, మాట్లాడే పరిధి అంతా సినిమాల వరకే అంటూ చెప్పారు.

ఇక యంగ్ టాప్ హీరోస్ లో మహేష్ బాబు చాలా సరదాగా అందరితో కూర్చొని నవ్వుతూ ఉంటారని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ చిన్నప్పటి నుండి ఎన్టీఆర్ ను చూస్తున్నానని అందువల్ల సాన్నిహిత్యం ఎక్కువగా ఉంటుందంటూ చెప్పాడు. బాబు అంటూ పిలుస్తానని ఒక హీరో అన్నట్లుగా నాతో ఉండరని చెప్పాడు. ఇక అల్లు అర్జున్ గురించి చెబుతూ నిత్య విద్యార్ధి లాగా ఎపుడు నటన నేర్చుకుంటూ ఉంటాడు, ఒక జూనియర్ ఆర్టిస్ట్ బాగా చేసినా అది కూడా గమనించి మళ్ళీ అనుకరిస్తూ తనలా చేసానా లేదా అని చూసుకుంటూ ఉంటాడు. ఇక నాగచైతన్య తో తన పని అనుభవం గురించి మాట్లాడుతూ ఒక గౌతమ బుద్ధుడి లాంటి వాడని చాలా ఇన్నోసెంట్ గా ఉంటాడని నాకు చాలా నచ్చుతాడని కితాబిచ్చారు.



























