Posani Krishna Murali: వెండితెరపై తన మాట తీరుతో నటనతో అందరిని ఎంతగానో ఆకట్టుకున్నటువంటి నటుడు పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో తన అద్భుతమైన కామెడీతో అందరిని నవ్వించిన పోసాని కేవలం నటుడుగా మాత్రమే కాకుండా రచయితగా దర్శకుడిగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఇలా ఈయన ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా కొనసాగుతున్నారు. రాజకీయాలలో కూడా ఈయన మాటతీరుతో పలుసార్లు వివాదాలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈయన వైసిపి పార్టీకి మద్దతు తెలపడంతో వైసిపి పార్టీలో ఈయనకు కీలక పదవిని కూడా ఇచ్చారు.
రాజకీయాలలోనూ సినిమాలలో ఎంతో బిజీగా ఉన్న ఈయన తాజాగా సుమ అడ్డా కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన తండ్రి గురించి తెలుసుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు.తన చిన్నప్పుడే తన తండ్రి చనిపోయారని పోసాని గుర్తు చేసుకున్నారు. తన తండ్రికి ఎలాంటి చెడు అలవాటు లేదని పేకాట అలవాటు మాత్రం ఉండేదని తెలిపారు. అయితే చాలామంది మా నాన్నను ఎందుకు సుబ్బారావు ఇలా చేస్తున్నావు అని అడిగేవారు.

Posani Krishna Murali: మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు…
ఇలా ప్రతి ఒక్కరూ అడగడంతో మా నాన్న ఎంతో మనస్థాపానికి గురైపొలం వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారని పోసాని తన తండ్రి గురించి తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ఇలా పోసాని కన్నీళ్లు పెట్టుకోవడంతో సుమ, అలీ కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు. తెరపై అందరినీ నవ్వించే పోసాని చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి ఇంత బాధను అధిగమించారని తెలుస్తోంది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 4వ తేదీన ప్రసారం కానుంది.



























