Posani Krishna Murali:ఇండస్ట్రీలో దర్శకుడిగా రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పోసాని మురళీకృష్ణ గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఇండస్ట్రీలో దర్శకుడిగా రచయితగా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో అందరూ మెంటల్ కృష్ణ అని కూడా పిలుస్తుంటారు.అయితే వీటి గురించి ఈయన ఏమాత్రం లెక్క చేయకుండా తన ఇష్ట ధోరణిలో నడుస్తూ తన ఇష్టాను గుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే పోసాని మురళీకృష్ణ ఎప్పుడు ఎవరిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఎవరికి తెలియదు. ఈ క్రమంలోనే పోసాని గతంలో ఒక డైరెక్టర్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.అయితే ఈయన ఓ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా ఆ సినిమాకు పనిచేసే కో డైరెక్టర్ పట్ల ఎంతో అవమానకరంగా ప్రవర్తించారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆ కో డైరెక్టర్ కి ఈయన తన పాడ్ తెచ్చి పెట్టమని చెప్పారట.అయితే తన పెన్ను పాడ్ కనిపించకపోవడంతో ఆ కో డైరెక్టర్ కనిపించలేదు అని సమాధానం చెప్పగా వెంటనే పోసాని తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కనిపించలేదు ఏంటి సార్ అని పిలవలేవా అంటూ అందరి ముందే తిట్టారట. అయితే కొంత సమయం తర్వాత కో డైరెక్టర్ మాట్లాడుతూ మురళి అని పిలిచారట.

Posani Krishna Murali: పేరు పెట్టి పిలిచినందుకే ఫైర్ అయిన పోసాని…
ఇలా తనని పేరు పెట్టి పిలవడంతో మండిపోయిన పోసాని తనని కాళ్ళతో తన్ని మురళి ఏంటి మురళి మురళి గారు అని పిలవలేవా అంటూ అందరి ముందు అవమానించానని స్వయంగా ఒప్పుకున్న ఈయన నా మేనరిజం స్ట్రగుల్ అలా ఉంటాయంటూ చెప్పుకొచ్చాడు.
ఈ విధంగా డైరెక్టర్ పట్ల ఈయన అవమానించిన తీరును తెలియజేయడంతో ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ప్రస్తుతం పోసాని ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటూ తరచూ ఏదో ఒక వివాదంలో నిలుస్తున్నారు.





























