బతుకు జట్కా బండి షో గుట్టు రట్టు చేసిన పోసాని!!

0
730

పోసాని పేరు చెబితే చాలు.. వెండితెర ఉలిక్కిపడుతుంది. బుల్లితెర చన్నబోతుంది. సినీ రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్టుగా పోసాని కృష్టమురళి ఇలా తన దైనందిన జీవితంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించడమే కాకుండా తనదైన సొంత శైలిలో ఎంతో మంది అభిమానుల హృదయాలలో ఓ సుస్ధిర స్ధానాన్ని సంపాదించుకున్నారు. ఉన్నది ఉన్నట్లుగా ఫేస్ 2 ఫేస్ మాట్లాడే పోసానిని చూసి.. ఎవరైనా సరే భయపడాల్సిందే. ఫైర్ బ్రాండ్ యాక్టర్‌గా, ఫిల్మ్ మేకర్‌గా ముఖానికి రంగు వేసుకోకుండా ఎప్పుడూ నిజాలనే మాట్లాడుతారు అది ఆయన నైజం. తాజాగా ఆయనిచ్చిన ఒక ఇంటర్వ్యూలో బతుకు జట్కా బండి కార్యక్రమంలో జరిగిన కొన్ని వివాదస్పదమైన విషయాలపై స్పందిస్తూ ఎన్నో ఆసక్తికరమైన అంశాలను తెలియజేశారు. వాటిల్లో ముఖ్యమైనవి తెలుగుడేస్క్ పాఠకుల కోసం..

నాకు సినిమా రంగం ఎంత ఇష్టమో.. టెలివిజన్ రంగమన్నా అంతే ఇష్టం. యాంకర్ సుమ చేసే షోలంటే ఇంకా ఇష్టం. ఆమె తన షోలకు పిలుస్తే వెళ్తుంటాను. అలాగే జబర్దస్త్ కామెడీ షోలో పాల్గొన్నాను. అలాగే రోజా హోస్ట్‌గా ఉండే బతుకు జట్కా బండి షోలో కూడా పాల్గొన్నాను. ఒక సంవత్సరం కాంట్రాక్టు పూర్తి కావడంతో ఇప్పుడు ఆ షోలో పాల్గొనడం మానేశాను అని అన్నారు. బతుకు జట్కా బండిలో జరిగిన కొన్ని వివాదస్పదమైన అంశాలపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అలాంటి కొన్ని విమర్శలు నా వరకు వచ్చాయి. అందులో పాల్గొనే వారిని నవ్వమని, ఏడ్వమని బలవంతం చేస్తారు. వారిని కొడతారనే వివాదాస్పద అంశాలు నేను ఆ షోలో ఉన్నప్పుడు జరగలేదు. నేను ఇలాంటి వాటికి వ్యతిరేకమని ముందే చెప్పాను. బతుకు జట్కా బండి కార్యక్రమంలో పాల్గొనే సమయంలో ముందే నేను ఏమి ఆశిస్తున్నానో అదే విషయాన్ని వారి ముఖం మీదే చెప్పాను. స్టేజ్ అంతా నాకు అప్పగించాలని.. మిగితా విషయాలు నేను చూసుకొంటానని చెప్పేశాను. జెన్యూన్ పర్సన్స్ అయితేనే బాధితులకు సపోర్ట్ చేస్తాను.

ఫలానా అమ్మాయికి సపోర్ట్ చేయమని అడిగితే నో చెప్పేవాడిని. నేను ఉన్నంత కాలం అలాంటివి జరుగలేదు. ఆ తర్వాత ఆ షోలో ఏం జరిగిందో నేను చెప్పలేను అని పోసాని అన్నారు. బతుకు జట్కా బండి ప్రొగ్రాంలో కొందరిని సపోర్ట్ చేయమని అడిగితే ఒప్పుకొనే వాడిని కాదు. అలాగని ఎవరూ ఎక్కువగా నన్ను ఫోర్స్ చేసేవారు కాదు. నేను ఆ షోలో ఉన్నంత కాలం ఎవరిని కొట్టిన దాఖలాలు లేవు. కొట్టించుకొనే సందర్భాలు కూడా లేవు. ఆ షోలో చాలా కుటుంబాలను కలిపాం. దాదాపు 90 శాతం విజయవంతమయ్యాయి. బయటకు వెళ్లిన తర్వాత 1,2 కేసులు ఫెయిలయ్యాయి అని పోసాని తెలిపారు.

బతుకు జట్కా బండి షోలో పాల్గొన్న వారి పిల్లలను చదివించేందుకు కొందరికి ఆర్ధిక సహాయం చేశాను. డబ్బులు లేని సమయంలో సహాయం చేయడం కుదరలేదు అని పోసాని వెల్లడించారు. ఇక ఇంటర్వ్యూను ముగిస్తూ చివరగా “నాకు వెకిలి చేష్టలు రావు. హింసించే 23వ రాజు పులకేశి లాగ నేనెవర్నీ హింసించను. సినిమా ఇండస్ట్రీలో కూడా నేను ఎవరిని కెలకను.. ఎవరు నన్ను కెలకరు” అని పోసాని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.😀😀

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here