విద్యుదాఘాతంతో ప్రియుడు శ్రీకాంత్ మరణాన్ని తట్టుకోలేక ప్రియురాలు సౌమ్య కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గ్రామనత్తం గ్రామంలో చోటు జరిగింది. ఆత్మకూరులో శుక్రవారం విద్యుదాఘాతంతో ప్రియుడు శ్రీకాంత్ మృతి చెందాడు. శ్రీకాంత్ మృతితో మనస్తాపం చెందిన ప్రియురాలు సౌమ్య అర్ధరాత్రి విషపు గుళికలు మింగి ఆత్మహత్య పాల్పడింది. ఇద్దరి మరణంతో గ్రామంలో విషాదాఛాయలు నెలకొన్నాయి.

































