Poverty In Telangana and AP: నీతి ఆయోగ్ జాతీయ బహువిధ దారిద్య్ర సూచికలో ఏపీ కన్నా తెలంగాణ వెనకబడి ఉంది. ఆర్థిక, సాంఘిక అసమానతలే తెలంగాణ ఉద్యమానికి కారణమయ్యాయి. తెలంగాణ వచ్చి ఏడేళ్లు గడిచాయి. అయితే చాలా విషయాల్లో తెలంగాణ ఏపీ కన్నా మెరుగ్గానే ఉంది.

ముఖ్యంగా ఆదాయంపరంగా తెలంగాణ, ఏపీ కన్నా ముందే ఉంది. హైదరాబాద్ తెలంగాణకు మెయిన్ ఆదాయ ఇంజిన్ గా పనిచేస్తోంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఏపీకి దూరంగా ఉంది. అయితే ఈ ఏడేళ్ల టైంలో విభజిత ఏపీ కంటే కూడా తెలంగాణలోనే ఎక్కువ పేదరికం ఉన్నదని నివేదికలు పేర్కొంటున్నాయి.

తాజాగా నీతి ఆయోగ్ రూపొందించిన జాతీయ బహువిధ దారి దారిద్య్ర సూచిలో ఈ విషయం తేటతెల్లం అవుతోంది. నీతి ఆయోగ్ జాబితాలో పేదరికంలో మొత్తం 28 రాష్ట్రాల్లో తెలంగాణ 18వ స్థానంలో ఉండగా… ఏపీ 20 వస్థానంలో నిలిచింది. తెలంగాణలో పూర్వపు 10 జిల్లాలను లెక్కలోకి తీసుకుంటే.. ఆదిలాబాద్ జిల్లా పేదరికంలో మొదటిస్థానంలో ఉంది. నీతి ఆయోగ్ ఈ నివేదికను 2015-16లో తయారైన ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ వివరాలను పరిగణనలోకి తీసుకుని తయారు చేసింది.
నీతి ఆయోగ్ నివేదికలో..
ఈ నివేదిక ఆరోగ్యం, ఫుడ్, విద్యా, లివింగ్ స్టాండర్స్.. ఈ నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకుని నివేదిక రూపొందించారు. ఇందులో మెరుగైన స్థితిలో ఉన్న రాష్ట్రాలు మంచి స్థానాన్ని సాధించాయి. దేశంలో పేదరికంలో బీహార్ మొదటిస్థానంలో ఉంది. కేరళ పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మెరుగైన స్థానాన్ని సాధించింది. 51.91 శాతంతో బీహార్ రాష్ట్రం అత్యంత నిరుపేద రాష్ట్రంగా ఉందని నివేదిక స్పష్టం చేసిందది. కేరళ 0.71 శాతం పేదరికం ఉన్నట్లు రిపోర్ట్ స్పష్టం చేసింది. మొత్తంగా నీతి ఆయోగ్ నివేదిక దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 700కు పైగా జిల్లాల్లో ప్రజల స్థితిగతులు, లివింగ్ స్టాండర్డ్స్, పేదరికాన్ని చూపింది.



























