పవర్ స్టార్..ఈ పేరు చెబితే చాలు పవన్ కల్యాణ్ ఫాన్స్ లో ఓ వైబ్రేషన్. ఈ పేరే కాదు ఆయన ఫొటో చూసినా, ఆయన కటౌట్ కనిపించినా ఆ కిక్కే వేరు. ఆయన తెరపై కనిపిస్తే చాలు.. పవన్ ఫాన్స్ ను ఆపడం ఎవరితరం కాదు. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. పవన్ కు కేవలం ఫాన్స్ మాత్రమే కాాదు. భక్తులు కూడా ఉన్నారు. వారు సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ ను ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉంటారు.

వాస్తవానికి టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాల సంఖ్య తక్కువే అయినప్పటికీ ఆయన చూపించిన ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ. అందుకే, రాజకీయాల్లోకి వెళ్లి కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమాలలో నటిస్తున్నా ఆయన సినీ ఇమేజ్‌కు, మార్కెట్‌కు ఏ మాత్రం డోకా లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పాత ఫొటోలు ఏవి బయటికి వచ్చినా అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్ కు చెందిన ఓ పాత ఫొటో సోషల్ మీడియాలో షికార్లు కొడుతోంది. ఈ ఫొటోలో యంగ్ పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయింది. అప్పుడప్పుడే వస్తోన్న మీసం, గెడ్డం.. చందమామలాంటి ఆ ముఖం వాహ్ సూపర్.. ముఖ్యంగా ఆ కళ్లు ఉన్నాయి చూసారూ.. ఆ లుక్స్ చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే..!

లేటెస్టుగా బయటికొచ్చిన ఈ ఫొటోను మీమ్స్ క్రియేటర్స్ విపరీతంగా వాడేస్తూ.. రకరకాల మీమ్స్ ను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసేస్తున్నారు. వాటిని చూసి పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక పవన్ సినీ కెరీర్ విషయానికొస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వేణు శ్రీరామ్ మరియు క్రిష్ ల సినిమాలలో నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ “వకీల్ సాబ్” కోసం పవన్ కళ్యాణ్ నవంబర్ నుండి షూట్ కి రెడీ కాబోతున్నట్లు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేసి షూట్ చేయనున్నారట. ఈ షూట్ తో సినిమా పుర్తవుతుందని.. అన్ని కుదిరితే వెంటనే రిలీజ్ కూడా ప్లాన్ చేస్తారట.

అయితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా తగ్గేవరకూ సినిమాల షూటింగ్ కి దూరంగా ఉండటమే మంచిదని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం మిగిలిన హీరోలు షూట్ కి రెడీ అవుతుండటంతో.. పవన్ వకీల్ సాబ్ బ్యాలెన్స్ షూట్ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట. అయితే క్రిష్ దర్శకత్వంలో పవన్ చేస్తోన్న సినిమాకి మాత్రం పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ ఇవ్వబోతున్నారని.. ఈ ఏడాది చివరి వరకూ తన పార్ట్ కు సంబంధించి ఎలాంటి షూట్ ను ప్లాన్ చెయ్యొద్దు అని ఇప్పటికే పవన్ కళ్యాణ్, క్రిష్ కి చెప్పినట్లు తెలుస్తోంది































