Prabhakar : చంద్ర హాస్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా నానుతోంది. నిజానికి మంచు ఫ్యామిలీ ప్లేసును కొట్టేసి మరీ ట్రోలర్స్ కి లడ్డులా దొరికాడు. మొదటి సినిమా ప్రకటన అప్పుడే ఆటిట్యూడ్ చూపించి బాబు కొంచం తగ్గించమ్మా అనేలా చేసుకున్నాడు. నెగెటివో పాజిటివో ఏదో ఒక పబ్లిసిటీ వస్తోందిలే చాలు అనుకున్నానరేమో కానీ ప్రభాకర్ కూడా ఈ విషయంలో పెద్దగా స్పందించలేదో లేదంటే కావాలనే నెగెటివ్ పబ్లిసిటీ కోసం కొడుకుతో అలా చేయించాడో ఎవరికి తెలిసు. సోషల్ మీడియా దునియాలో ఎలాగైనా సరే ఫేమస్ అవడం ఇంపార్టెంట్ కదా. ఈ ట్రోల్ల్స్ ఇప్పట్లో ఆగేటట్లు కనిపించడం లేదు అయితే ప్రభాకర్ అన్న కొత్త స్టఫ్ ఇచ్చాడు మీమర్స్ కి, ట్రోల్లర్స్ కి, మీడియా ముందుకు వచ్చి మరీ బాబు గురించి చెప్పాడు.

మావాడిని ఆ విషయంలో లో భరించడం కష్టం…
మీడియా ముందు ఇంకా ఎలా మెలగాలో నా కొడుకుకి తెలియదు మెల్లగా అన్నీ వాడే నేర్చుకుంటాడు అంటూ ప్రభాకర్ పుత్ర రత్నాన్ని వెనకేసుకొచ్చాడు. ఇక కొడుకు గురించి చెబుతూ మా వాడికి బ్రాండు పిచ్చి బాగా ఉంది. నాకలాంటి పట్టింపులేమీ ఉండవు ఏదోకటి వేసుకుందాం అనుకుంటా కానీ మావాడు మాత్రం బ్రాండెడ్ దుస్తులే వేస్తాడు. తనతో ఉన్న ఏ గాడ్జెట్ అయినా వస్తువైనా బ్రాండెడ్ ఉండాలని అనుకుంటాడు. ఒకసారి అమెరికా నుండి వాచ్ తీసుకు వస్తే చూడగానే ఇది బ్రాండెడ్ కాదు నాకు వద్దు అనేసాడు.
చూడగానే అది బ్రాండెడా కాదా అనే విషయంలో ఇప్పటి పిల్లలు ఇట్టే కనిపెట్టేస్తున్నారు అంటూ సుపుత్రుడి గొప్పతనం గురించి వర్ణించారు ప్రభాకర్. ఒకే సారి మూడు సినిమాల్లో నటిస్తున్న చంద్రహాస్, మొదటి సినిమాకే ఇంత బిల్డ్ అప్ కొడితే ఇక ఆ సినిమా హిట్ అయితే పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని నెటిజన్లు ఆలోచిస్తున్నారు. చూడాలి మరి మన బ్రాండూబాబు పెరఫార్మెన్స్ సినిమాల్లో కేక పుట్టిస్తుందో లేక రోత పుట్టిస్తుందో.



























