హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తుంది. లాక్ డౌన్ ఉన్నంతసేపు కాస్త బాగానే ఉన్నట్టు అనిపించినా లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత కరోనా కేసుల సంఖ్యా భారీగా పెరుగుతుంది. అయితే లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా టాలీవుడ్‌లో సీరియల్స్‌తో పాటు సినిమాలకు షూటింగ్ జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో పలు ఛానల్స్‌కు చెందిన సీరియల్ షూటింగ్ లను ప్రారంభమయ్యాయి. అయితే తాజగా షూటింగ్ జరుపుతున్న సమయంలో ఒక సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ నటుడిపేరు ప్రభాకర్ అని తెలిసింది.

ఆ సీరియల్ షూటింగ్ సమయంలో పాల్గొన్న సిబ్బంది అందరు కరోనా పరీక్షలు చేయించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆ సీరియల్ షూటింగ్ కూడా ఆగిపోయిందని సమాచారం. అయితే ఆ నటుడు జీ తెలుగులో ఛానెల్ లో ప్రసారం అవుతున్న “సూర్యకాంతం” అనే సీరియల్ లో నటిస్తాడని తెలుస్తోంది. దీంతో సీరియల్ ఆర్టిస్టులంతా షాక్‌కు గురయ్యారు. అయితే ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. ప్రభాకర్ అనే ఓ నటడుకి కరోనా వస్తే.. మరో సీరియల్ నటుడు ప్రభాకర్‌కు పరామర్శలు మొదలయ్యాయి.

ఈటీవీ నుంచి మొదలుపెట్టి జీ తెలుగు వరకు సీరియల్స్ లో పలు ప్రముఖ సీరియల్స్ లో నటించిన నటుడు ప్రభాకర్‌కు కరోనా సోకిందని అందరూ భావించారు. అయితే పలు వార్త సంస్థలు కూడా ఈ ప్రభాకర్ ఫోటోను ప్రచురించడం జరిగింది. దీంతో నాకు కరోనా రాలేదు.. నేను సేఫ్ గానే ఉన్నాను అంటూ క్లారిటీ ఇచ్చారు నటుడు ప్రభాకర్. మరోవైపు మరో ప్రభాకర్‌కు కరోనా సోకడంతో నటీనటులు ఎవ్వరూ షూటింగ్స్ లో పాల్గొనవద్దని తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆదేశాలు జారీచేసింది.



























