Prabhas : టాలీవుడ్ లోనే కాదు ప్రభాస్ అంటే ఇపుడు బాలీవుడ్ లోనూ పిచ్చ క్రేజ్ ఉంది, అది మరోసారి రుజువయింది ఈ ఇష్యూ తో. ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఇండియా మొత్తం పాకిపోయింది హాలీవుడ్ లో సైతం అభిమానులు ఉన్నారు. ఇక బాహుబలి సినిమా తరువాత రెండు వరుస ప్లాప్ లు వచ్చినా కూడా ప్రభాస్ కి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం పెద్ద ప్రాజెక్ట్స్ తో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ‘ఆదిపురుష్’ మరొకరి ‘ప్రాజెస్ట్ కే’. ఇక మరొకటి ప్రశాంత్ నీల్ ‘సలార్’. ఈ మూడిటి అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ టైములో ప్రభాస్ ఒక హీరోయిన్ తో మాట్లాడిన ఫోన్ కాల్ లీక్ అవడంతో అది బాగా వైరల్ అయింది.

కృతి సనన్ తో ఫోన్ మాట్లాడిన డార్లింగ్…
కాఫి విత్ కరణ్ షో బాలీవుడ్ లో చాలా పాపులర్. బడా డైరెక్టర్ కరణ్ జోహార్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతూవాళ్ళ సినిమాను ప్రమోట్ చేసుకోడానికి ఎంతో మంది సెలబ్రిటీలు ఈ షో కి వస్తారు. అయితే కరణ్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఇబ్బంది పడే కొంతమంది ఈ షోకి రావడానికి ఇష్టపడరు. ఇక కాఫీ విత్ కరణ్ షో లో తాజాగా టైగర్ ష్రాఫ్, కృతి సనన్ రాగా ఇంటర్వ్యూ లో బోల్డ్ ప్రశ్నలు సమాధానలు అన్ని ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి.

"You are amaaaaazing, I will call you back after the show" – #KritiSanon
— manu (@Itsmanvika_) August 31, 2022
"Okay Take careeee." and the shy smile of #Prabhas ????????❤️#Adipurush just keeps getting better for me ????#KoffeeWithKaran7 pic.twitter.com/vWZgQkNoUM
ఇక చివర్లో ఒక సెలబ్రిటీకి ఫోన్ చేయాల్సి రాగా కృతి సనన్ వెంటనే ప్రభాస్ కి కాల్ చేసి హయ్ ప్రభాస్ నేను కృతి అనగానే ప్రభాస్ హయ్ అంటూ పలకరించాడు. నేను కాఫీ విత్ కరన్ షోలో ఉన్నాను అంటూ చెప్పగా ఇక కరణ్ జోహార్ మాట్లాడి హయ్ ప్రభాస్ అని పలకరించాడు. హయ్ కరణ్ దిస్ ఇస్ ప్రభాస్ అనగానే కరణ్ కృతికి నువ్వు రెండు పాయింట్లు వచ్చేలా చేసావు యూ ఆర్ ద వన్ అండ్ ఓన్లీ బాహుబలి అంటూ పొగిడాడు. ఇక కృతి యూ ఆర్ అమేజింగ్ అంటూ ప్రభాస్ ణి అంటూ మళ్ళీ కాల్ చేస్తానని చెప్పగా ప్రభాస్ టేక్ కేర్ అంటూ చెప్పాడు. ఈ సంభాషణ కు సంబంధిచిన వీడియో టాప్ ట్రెండింగ్ లో ఉంది.



























