Prabhas: సినీ నటుడు ప్రభాస్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రభాస్ సాంప్రదాయంగా పట్టు పంచ చొక్కా ధరించి నేడు ఉదయం సుప్రభాత సేవలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఇలా స్వామి వారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం తీసుకున్నారు.

వేద పండితుల ఆశీర్వాదం అనంతరం స్వామివారి పట్టు వస్త్రాలను తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇలా స్వామివారి దర్శనం అనంతరం ఈయన ఆలయం వెలుపలకి రావడంతో ఒక్కసారిగా అభిమానులు ప్రభాస్ తో సెల్ఫీలు దిగడం కోసం పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే ప్రభాస్ ఆది పురుష్ సినిమా ద్వారా జూన్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో నేడు తిరుపతిలో ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ వేడుకలో పాల్గొనడం కోసం తిరుపతి చేరుకున్నటువంటి ప్రభాస్ స్వామి వారి దర్శనం కోసం తిరుమల వెళ్లారు.

Prabhas: తిరుపతిలో సందడి చేస్తున్న ప్రభాస్…
నేడు సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం కాబోతున్నటువంటి ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ పాల్గొనబోతున్నారు. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించగా కృతి సనన్ సీత పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కానుంది.