Prabhas: బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలేవి ప్రేక్షకులను ఇప్పటివరకు సంతృప్తి పరచలేకపోయాయి. అయితే ఈయన నటిస్తున్నటువంటి కల్కి సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ వ్యక్తిగతంగా కూడా అంతే స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రభాస్ మంచితనం గురించి ఆయన ఇచ్చే ఆతిథ్యం గురించి ఇప్పటివరకు ఎంతోమంది ఎంతో గొప్పగా చెప్పారు.అయితే ప్రభాస్ కి ఇవన్నీ కూడా పుట్టుకతోనే వచ్చాయని చెప్పాలి తన కుటుంబంలో కూడా ఇలాంటి పద్ధతిలో ఉండటం వల్లే ప్రభాస్ కూడా అందరి పట్ల ఎంతో ప్రేమగా ఉంటారు.
కుటుంబం అంటే ఎంతో ప్రాధాన్యత ఇచ్చే ప్రభాస్ తన తండ్రి పెదనాన్న ఇద్దరు చనిపోయిన తర్వాత కుటుంబ బాధ్యతలను తానే చూసుకుంటూ ఉన్నారు.ఇక ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు కూడా ఇండస్ట్రీలో నిర్మాతగా పనిచేస్తారు. ఇక ఈయన ప్రభాస్ ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చిన తరువాతనే మరణించారు. ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమా చూసిన సూర్యనారాయణ తన కొడుకు ఎప్పటికైనా ఒక పెద్ద స్టార్ అవుతారని భావించారట.

Prabhas:
ఇలా తన తండ్రి అనుకున్న విధంగానే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు ఇకపోతే ప్రభాస్ తన తండ్రికి ఇచ్చిన ఒక కానుక గురించి ప్రస్తుతం ఒక వార్త వైరల్ గా మారింది. ప్రభాస్ ఈశ్వర్ సినిమా తర్వాత తన తండ్రి ఒక ఖరీదైన కారును కానుకగా ఇచ్చారట ఇదే తన తండ్రికి ప్రభాస్ ఇచ్చిన చివరి కానుక అని తెలుస్తుంది. ఒకవేళ ఈ కారు కనుక కానుక ఇవ్వకపోయి ఉంటే ప్రభాస్ తన జీవితం మొత్తం తన తండ్రికి ఏమి ఇవ్వలేకపోయాను అని పశ్చాత్తాపం ఉండేదని తెలుస్తోంది.