Prabhas Fans: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్ కార్యక్రమంలో మాట్లాడుతూ బాలకృష్ణ తన ఇంట్లో కూర్చుని తన చెల్లి గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేయించారంటూ మండిపడ్డారు అయితే ఈ వ్యాఖ్యలపై వైయస్ షర్మిల ఘాటుగా స్పందిస్తూ తన అన్నయ్య పై విమర్శలు కురిపించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయించింది బాలకృష్ణ కాదు జగన్మోహన్ రెడ్డి అంటూ ఈమె కామెంట్ చేశారు.

జగన్మోహన్ రెడ్డి తన సైతాన్ సైన్యంతో సోషల్ మీడియా వేదికగా ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయించారు. అయితే సోషల్ మీడియాలో నా గురించి ప్రభాస్ గురించి వస్తున్న వార్తలలో నిజం లేదు అసలు ఇప్పటివరకు నాకు ప్రభాస్ అంటే ఎవడో కూడా తెలియదు నేను నా పిల్లలపై ఇప్పుడు అప్పుడు కూడా ప్రమాణం చేసి ఒకటే మాట చెబుతున్నాను తనకు నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
ఈ విధంగా పాన్ ఇండియా స్టార్ హీరో అయినటువంటి ప్రభాస్ ని పట్టుకొని ఈమె ఏక వచనంతో ఎవడో అని మాట్లాడటం పట్ల ప్రభాస్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ప్రభాస్ ఎవడో నీకు తెలియదా అంటూ గతాన్ని తవ్వుతున్నారు. ప్రభాస్ అంటే ఎవరో తెలికనే మీ నాన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రభాస్ నటిస్తున్న యోగి సినిమా పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Prabhas Fans: యోగి సినిమా..
ప్రభాస్ ఎవరు తెలియనిదే మీ నాన్నగారితో కలిసి మీ అమ్మగారు ఈ సినిమా పూజా కార్యక్రమాలకు వచ్చారా మీ నాన్నగారు ప్రభాస్ పై క్లాప్ కొట్టారా అంటూ గత ఫోటోలను షేర్ చేస్తూ షర్మిలను ప్రశ్నిస్తున్నారు. మీ వ్యక్తిగత వివాదాలు పూర్తిగా మీ వ్యక్తిగతమే కానీ ఇలా మా హీరో గురించి ఏక వచనంతో సంబోధించడం సరికాదని షర్మిల బహిరంగంగా మా హీరోకి క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్లు చేస్తున్నారు.


























