Prabhas: పాన్ ఇండియా హీరో ప్రభాస్ మంచి మనసు గురించి, ఆయన చేసే గొప్ప పనుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కొనసాగుతున్నాడు. అయితే సినిమాలలో మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా ప్రభాస్ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. తరచూ అవసరమైన వారికి తన వంతు సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

తాజాగా మరొక మంచి పని చేసి తన గొప్ప మనసు చాటుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు..ఈ క్రమంలో సినిమా విడుదల సందర్భంగా భద్రాద్రి, సీతారాముల ఆలయానికి భారీగా విరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లు కూడా ప్రారంభించారు.
ఇదిలా ఉండగా చిన్నప్పటినుండి రాముడి మీద ఉన్న భక్తితో ఈ సినిమా చేయటానికి అంగీకరించిన ప్రభాస్.. సినిమా విడుదలకు ముందు శ్రీరాముడి భక్తుల కోసం ఏదైనా చేయాలని భావించాడు. ఈ క్రమంలో దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రాములవారి అన్నదాన సత్రానికి 10 లక్షల విరాళం ప్రకటించాడు.
యూవీ క్రియేషన్స్ ప్రతినిధి ద్వారా భద్రాచలం రామాలయ ఈవో రమాదేవికి 10 లక్షల రూపాయల చెక్కును శనివారం అందించాడు.

Prabhas: అన్నదాన సత్రానికి 10 లక్షల విరాళం…
అంతేకాకుండా భద్రాద్రి, శ్రీరాముడి ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయం చేస్తానని వెల్లడించాడు. ప్రభాస్ చేసిన ఈ మంచి పనికి ఆయన అభిమానులు ప్రశంసిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన ఆది పురుష్ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే విడుదలై మిలియన్ల కొద్ది వ్యూస్ ని సాధించి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.