Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు పొందినటువంటి వారిలో ప్రభాస్ ముందు వరుసలో ఉంటారు. ఈయన నాలుగు పదుల వయసులో ఉన్న ఇప్పటికి పెళ్లి చేసుకోకపోవడంతో తరచూ ప్రభాస్ పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

అభిమానులు కూడా ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారన్న ప్రశ్నలు తరచూ వేస్తూ ఉంటారు అయితే తాజాగా ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్టు కనుక చూస్తే ఈయన తప్పనిసరిగా తన పెళ్లిని ఉద్దేశించే ఈ పోస్ట్ చేశారని తెలుస్తోంది.
డార్లింగ్స్ త్వరలోనే ఒక స్పెషల్ పర్సన్ తన జీవితంలోకి రాబోతున్నారు కొద్ది రోజులు వెయిట్ చేయండి అంటూ ఈయన ఒక పోస్ట్ చేశారు అయితే ఆ పోస్ట్ దేనిని ఉద్దేశించి చేశారన్నది మాత్రం తెలియచేయలేదు బహుశా ఈ పోస్ట్ తన పెళ్లినీ ఉద్దేశించి చేశారని స్పష్టంగా తెలుస్తుంది. మరి ప్రభాస్ పెళ్లి గురించే ఈ పోస్ట్ చేసి ఉంటే ఆయన పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనే విషయంపై చర్చలు మొదలయ్యాయి.
స్పెషల్ పర్సన్..
ఇక ప్రభాస్ కెరియర్ పరంగా ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈయన వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈయన నటించిన కల్కి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండక ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడగా జూన్ 27వ తేదీ విడుదల కానుంది.



























