పరిచయం అవసరం లేనివారిలో యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఒకరు. తన యొక్క సమయస్ఫర్తితో అందరినీ ఆటపట్టిస్తు నవ్వించడం లో ప్రదీప్ తన కంటు ఒక స్థానాన్ని నిలుపుకున్నారు. మేల్ యాంకర్ లో ప్రదీప్ మొదటి స్థానంలో ఉన్నాడు.. దాదాపు ప్రదీప్ చేసిన అన్ని షోలు సూపర్ హిట్ అయ్యాయి. ఒక్క పెళ్లిచూపులు మాత్రం అయనపై తీవ్ర వ్యతిరేకత తెచ్చుకుంది. యాంకరింగ్ లో తన ప్రతిభతో మంచి పేరు సంపాదించుకున్న ప్రదీప్ ఇపుడు హీరోగా తన యాక్టింగ్ కెరీర్ ని మొదలుపెట్టాడు. అయితే తన మొదటి సినిమా “30 రోజుల్లో ప్రేమించడం ఎలా”, ఈ సినిమా కొత్త దర్శకుడు మున్నా తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సినిమా ప్రమోషన్లు మాత్రం ప్రదీప్ చాలా పగడ్బందీగా చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో మొదటి సాంగ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రిలీజ్ చేయించాడు. ఇది విడుదలైన కొద్ది రోజుల్లోనే యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సంపాదించింది. మరో పాటను హీరోయిన్ కాజల్ తో విడుదల చేయించాడు. అంతకుముందు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను హీరో రానాతో విడుదల చేయించాడు. తన సినిమాకోసం ప్రదీప్ స్టార్స్ ను బాగానే వాడుకుంటున్నాడు. ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం తన పరిచయాలు బాగా వాడుకుంటున్నాడు ప్రదీప్.
తాజాగా విదులైన “మీకోదండం…” పాటలో ప్రదీప్ డాన్సులు చుసిన వారు ప్రదీప్ డాన్స్ ఇరగదీసాడు అంటున్నారు. ఈ పాటను కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్టెప్పులు కంపోజ్ చేసారు. ప్రదీప్ లో ఇంత డాన్సింగ్ టాలెంట్ ఉందా ! అనిపించే అంతగా డాన్స్ చేసాడు యాంకర్ ప్రదీప్. దేనికోసం శేఖర్ మాస్టర్ ప్రదీప్ బెండు తీసేశాడట. ఈ పాటను చంద్రబోస్ రచించాడు. ఈ చిత్రం కోసం దాదాపు 3.8 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రదీప్ చెప్పే 30 రోజుల్లో ప్రేమ పాఠాలు ఎంతవరకు ప్రేక్షకులకు మెప్పిస్తాయో చూడాలి.
































