Prakash Raj : విలక్షణ నటుడు గా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ సినిమాలే కాకుండా ప్రస్తుతం పాలిటిక్స్ లోనూ విలక్షణంగానే ఉన్నాడు. ప్రకాష్ రాజ్ సొంత రాష్ట్రం కర్ణాటక, చదువుకునే రోజుల్లో ఎన్నో డ్రామాలలో నటించిన ప్రకాష్ ఆ తరువాత తమిళ సినిమా ద్వారా సినిమాకు పరిచయమయ్యాడు. ఆ తరువాత తెలుగు మలయాళం అంటూ అన్ని భాధలలోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా ఏదైనా పాత్ర ఏదైనా ప్రకాశ్ రాజ్ నటన సినిమాకు ప్లస్ అనేలా ఆయన నటిస్తారు. నేను మోనార్క్ ని, నన్నెవరూ మోసం చేయలేరు అంటూ విలనిజం చూపించినా, అంతః పురంలో ఫ్యాక్షన్ నేతగా చేసినా ఖడ్గంలో ఒక భారతీయ ముస్లిం గా నటించినా అన్నింటిలోనూ తన పాత్రకు న్యాయం చేసాడు ప్రకాష్ రాజ్.

నన్ను తెలుగులో ఏడు సార్లు బ్యాన్ చేసారు…
ఇక వివాదాలు కూడా ప్రకాష్ రాజ్ కు కొత్త కాదు. ఇప్పటి వరకూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఏడు సార్లు బ్యాన్ ఎదుర్కొన్నారు ప్రకాష్ రాజ్. ఇక ఈవిషయంలో ప్రకాష్ రాజ్ ను అడిగినపుడు ఒక మనిషి కెరీర్ లో ముందుకు వెళ్తుంటే పేరుతో పాటే వివాదాలు వస్తాయి. తప్పు ఒకరిది ఎప్పుడు ఉండదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు కొట్టగలం అంటూ చెప్పారు. కథ చెప్పినపుడు ఒకలాగా, సినిమా షూటింగ్ అప్పుడు ఒకలాగా ఉన్నపుడు, లేదా ఇతర కారణాల వల్ల కొన్ని మనస్పర్తలు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో మాటమీద నిలబడటం వల్ల నాపై ఆరోపణలు వచ్చాయి అప్పుడు అర్థమైంది అన్ని సందర్భాలోనూ మాట మీద నిలబడకూడదని నేను ముక్కుసూటి మనిషి అవ్వడం వల్ల మరింత ఇబ్బందులను ఎదుర్కొన్నాను.

ఒక తెలుగు ఇండస్ట్రీ మాత్రమే నన్ను ఏడు సార్లు బ్యాన్ చేసారు, మళ్ళీ కూర్చొని మాట్లాడి సెటిల్ చేసుకున్నాం అంతే అవి అక్కడికి వదిలేసి ముందుకు వెళ్తాను అంతే ఆ సంఘటన నుండి కొత్త విషయం నేర్చుకుంటాను అంటూ చెప్పారు. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం ఒక మంచి వ్యక్తి పాలిటిక్స్ లోకి రావడం నచ్చింది. కానీ వ్యక్తిగత సిద్ధాంతాలు ఇద్దరికీ వేరు నేను అతని ఆలోచనలు వ్యతిరేకిస్తానే కానీ అతన్ని ద్వేషంచను, నాకు పవన్ అంటే చాలా ఇష్టం అంటూ చెపారు ప్రకాష్ రాజ్.

































