Prakash Raj : ప్రకాశ్ రాజ్.. అద్భుతమైన నటుడు. చాలా భాషల్లో వందల సినిమాల్లో నటించి అందరినీ మెప్పించిన నటుడు. ఏ పాత్ర అయినా సరే.. అవలీలగా చేసే సత్తా ఉన్న నటుడు. అందుకే.. తెలుగు, తమిళం, కన్నడ లాంటి భాషల్లో ఎన్నో ముఖ్యమైన పాత్రలను పోషించారు ప్రకాశ్ రాజ్. సినిమాల పరంగా అసలు.. ప్రకాశ్ రాజ్ ను ఢీకొట్టేవారే లేరు. అది ప్రకాశ్ రాజ్ టాలెంట్. అయితే.. చాలామందికి అసలు ప్రకాశ్ రాజ్ గురించి కొన్ని విషయాలు తెలియవు. ఆయన సొంతూరు ఏది? ఎక్కడ పుట్టారు? సినిమా రంగంలోకి ఎలా వచ్చారు? అనే విషయాలు తెలియవు.

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రకాశ్ రాజ్.. తన బ్యాక్ గ్రౌండ్, సినిమాలు, ఇతర విషయాల గురించి మాట్లాడారు. నిజానికి.. ప్రకాశ్ రాజ్ ది బెంగళూరు. ఆయన మాతృ భాష కన్నడ. తన తండ్రి మాతృ భాష తుళు. ప్రకాశ్ రాజ్ కు చప్పట్లంటే ఇష్టమట. ఎవరైనా తనని చూసి చప్పట్లు కొడితే చాలా ఇష్టమట. అదే తనను సినిమా రంగం వైపునకు తీసుకెళ్లింది అని చెబుతున్నారు ప్రకాశ్ రాజ్.

Prakash Raj : ఎదుటి వాళ్లు నా గురించి ఏమనుకున్నా నేను పట్టించుకోను
ప్రకాశ్ రాజ్ ను మనం సినిమాల్లో ఎలా చూస్తామో.. రియల్ గా మాత్రం పూర్తిగా ఆయనది డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన ఎదుటి వాళ్లు తన గురించి ఏమనుకున్నా పెద్దగా పట్టించుకోరట. ఎందుకంటే.. ఎదుటి వాళ్లు తనను ఏమైనా అంటే.. అది వాళ్ల సమస్య అని చెబుతున్నారు ప్రకాశ్ రాజ్. తనకు చాలా పనులు ఉన్నాయని.. ఎదుటి వాళ్లు ఏదైనా అంటే అది తన సమస్య కాదంటూ చెప్పుకొచ్చారు ప్రకాశ్ రాజ్.

Prakash Raj : నాకు పర్సనల్ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు
ప్రతి ఇండస్ట్రీలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. హైదరాబాద్ వస్తే.. తెలుగు నటులు, మ్యూజిక్ డైరెక్టర్లు, నిర్మాతలతో ఫ్రెండ్లీగా ఉంటా. ముంబై వెళ్తే అక్కడి వాళ్లు ఉన్నారు. బెంగళూరు వెళ్తే కూడా అంతే. ఎక్కడికి వెళ్లినా.. అక్కడి ఫ్రెండ్స్ తో సరదాగా ఉంటాను కానీ… నాకు పర్సనల్ ఫ్రెండ్స్ మాత్రం ఎవ్వరూ లేరు. అందరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమే.. అంటూ తన వ్యక్తిత్వం గురించి చెప్పుకొచ్చారు ప్రకాశ్ రాజ్.

Prakash Raj : నాకు అవార్డులు నచ్చవు
జాతీయ అవార్డులు రాగానే.. మనమేమీ తోపులం కాదు. సినిమా రంగంలో అవార్డు రాగానే.. మనం తోపు నటులం కాదు. ఒక సంవత్సరం కొన్ని సినిమాల్లో బెస్ట్ గా నటించిన వాళ్లను తీసుకొని బెస్ట్ యాక్టర్ అవార్డు ఇస్తారు. మళ్లీ తదుపరి సంవత్సరం మళ్లీ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిందే. అందుకే… నేను పెద్దగా అవార్డులను పట్టించుకోను. నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉండటమే.. అంటూ అవార్డుల గురించి చెప్పుకొచ్చారు ప్రకాశ్ రాజ్.

ఇన్ని భాషల్లో సినిమాలు చేసినా.. తనకు జీవితం అంటే సినిమాలు కాదు అంటూ చెప్పుకొచ్చారు ప్రకాశ్ రాజ్. నాకు సినిమా మాత్రమే జీవితం కాదు. నా జీవితంలో సినిమా అంటే కేవలం 5 శాతం మాత్రమే. మిగతా 95 శాతం నాకు వేరే వ్యాపకాలు ఉన్నాయి. నా జీవితంలో 5 శాతమే అయిన సినిమాల గురించి నేను పెద్దగా పట్టించుకోను. నాకు అవకాశం వస్తే.. చేసుకుంటూ వెళ్తాను. ఆ తర్వాత నాకు చాలా పనులు ఉంటాయి. అందుకే.. నేను ఇండస్ట్రీలో పుట్టే పుకార్లను పట్టించుకోను. నాకు అంత సమయం కూడా ఉండదు. నాకు వేరే పనులు చాలా ఉంటాయి.. అంటూ తన నటన గురించి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ప్రకాశ్ రాజ్.



























