Prakruthi Mishra : ప్రకృతి మిశ్ర.. ఒడియా కు చెందిన ప్రముఖ నటి, అంతే కాకుండా హిందీ టెలివిజన్ లో ప్రసారం అయ్యే సీరియల్స్ లో కూడా నటిస్తోంది. ఇటీవల ‘జై కన్నయ్య లాల్ కి’ లో దేవానీగా దీంతోపాటు, ‘బిట్టి బిజినెస్ వాలి’లో బిట్టిగా మరియు రియాలిటీ షో ‘ఏస్ ఆఫ్ స్పేస్ 2’ లో కనిపించింది. ‘హలో అర్సీ’కి గాను జాతీయ చలన చిత్ర పురాస్కారం కూడా అందుకుంది. అయితే ప్రస్తుతం ప్రకృతి మిశ్ర కు సంబందించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒడియా నటుడు అయిన బాబుసన్ మొహంతి భార్య, ప్రకృతి మిశ్ర పై దాడి చేసింది.

నడి రోడ్డులో జుట్టు పట్టుకొని…
బాబూసన్ మొహంతి నటుడుగానే కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రకృతి మిశ్ర, బాబుషన్ మొహంతి ప్రేమమ్ సినిమాలో కలసి నటించారు. ఈ క్రమంలోనే ఉత్కాల్ అసోసియేషన్ చెన్నై లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు అయ్యి ఇద్దరూ తిరిగి వడ్తుండగా… వీళ్లిద్దరి మధ్య ఎదో ఉందని భావించిన బాబూసన్ భార్య అయిన తృప్తి వారరిద్దరూ వస్తున్న కారు ఆపి ఎక్కింది.

[VIDEO] 'Let me meet my grandson'
— OTV (@otvnews) July 23, 2022
Assault of Prakruti Mishra by co-actor Babushaan's wife – Babushaan's mother Aparajita arrives to meet daughter-in-law
LINK – https://t.co/4SdAWNyJka pic.twitter.com/ipW0ceE8d6
కారు ఎక్కినా తృప్తి లేక తన భర్తతో వున్న హీరోయిన్ ప్రకృతి మిశ్రను జుట్టుపట్టుకొని కారులోనుంచి కిందకు లాగి మరీ కొట్టింది. ప్రకృతి అక్కడ వున్నవారిని సాయం కోరినా అందరూ సెల్ఫీలు వీడియోలు తీసుకోవడానికి మాత్రమే చూసారు. ఎలాగోలా అక్కడి నుంచి ప్రకృతి పారిపోతున్నా వెంటపడి కొట్టడానికి ప్రయత్నించింది. చివరకు ఆటో ఎక్కి ప్రకృతి అక్కడినుంచి పారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.































