Prasanna Kumar : నందమూరి తారకరత్న గుండెపోటు వచ్చి 23 రోజులు పోరాడి చివరకు శివరాత్రి రోజున మరణించారు. ఆయన మరణించిన తరువాత సోషల్ మీడియాలో ఆయన గురించి ఫ్యామిలీ గురించి ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలు పక్కన పెడితే నిజాలు వదిలేసి వదంతులను బాగా వైరల్ చేస్తున్నారు. అలేఖ్య రెడ్డి జాతకంలో భర్తతో విడాకులు కాని భర్త మరణం కానీ ఉన్నాయి అంటూ వస్తున్న వార్తల నడుమ ఆవ్వన్నీ ఒట్టి పుకార్లు, మనిషి మరణంను ఎవరూ ఆపలేరు అంటూ నందమూరి ఫ్యామిలీకి ఆత్యంత సన్నిహితులైన ప్రసన్న కుమార్ గారు మాట్లాడారు.

ఆమెకు పూజ చేసుంటే తారకరత్న బతికేవాడని…
తారకరత్న కు గుండె పోటు వచ్చి బెంగళూరులో చికిత్స చేయిస్తున్న సమయంలో అలేఖ్య రెడ్డి వైపు బంధువులు విజయసాయి రెడ్డి తదితరులు బెంగళూరులోనే జాతకం చూపించగా నందమూరి వాళ్ళ కుల దేవతకు పూజ చేయించుకోమని చెప్పారట. నందమూరి వారి కుల దేవత నాయకమ్మ తల్లి, ఆమెకు పూజ చేయించడానికి ప్రయత్నించగా నందమూరి కుటుంబంలోని వ్యక్తి అయిన సాంబశివరావు గారి భార్య మరణించింది. దీంతో మైల ఉండటం వల్ల అది అయ్యాక పూజ చేయించాలని భావించారు.

అయితే మళ్ళీ మైలా అయ్యాక చేయించాలని మరుసటి రోజు అనుకోగానే మరో వ్యక్తి నందమూరి కుటుంబం నుండి మరణించారు. దీంతో మళ్ళీ మైల ఉండటంతో చేయించలేదు. అయ్యాక చేయించాలి అనుకునేలోపు మూడురోజుల్లోనే తారకరత్న శివరాత్రి నాడు మరణించాడు అంటూ ప్రసన్న కుమార్ గారు చెప్పారు. విధిరతాను ఎవరూ మార్చలేరని, చావు పుట్టుకలు మనకు చెప్పి రావు అంటూ వాఖ్యణించారు. అనవసరంగా సోషల్ మీడియాలో లేనిపోని వార్తలు రాసి ఆ వ్యక్తులను మానసికంగా క్రుంగదీస్తున్నారు అంటూ అభిప్రాయపడ్డారు.
































